Viral Video: ఏం ఐడియా గురూ.! నోరూరించే టేస్టీ చాట్.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు!
మనవాళ్లకు పానీపూరి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో.. అంతే ప్రేమ చాట్‌పై కూడా ఉంటుంది. ఇక చాట్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. దహి వడా..

మనవాళ్లకు పానీపూరి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో.. అంతే ప్రేమ చాట్‌పై కూడా ఉంటుంది. ఇక చాట్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. దహి వడా, పాపడ్ చాట్, సేవ్ పూరి, దబెలి.. ఇలా ఎన్నో రకాల చాట్స్‌ను ప్రజలు ఇష్టపడుతుంటారు. ప్రతీ స్ట్రీట్‌లోనూ ఇలాంటి చాట్స్ చేసేవాళ్లు కోకొల్లలు. అయితే మీరెప్పుడైనా ప్రత్యేకమైన, ఆరోగ్యకరమైన చాట్‌ను రుచి చూశారా.? కాన్పూర్‌కు చెందిన ఓ పెద్దాయన ఈ రుచికరమైన చాట్‌ను తయారు చేస్తున్నారు. ఆయన మొలకలతో చేసే ఈ చాట్‌ను మీరు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ గురవ్ వసన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇప్పటిదాకా దీనికి 19.8 మిలియన్ వ్యూస్, 1.8 మిలియన్ లైకులు వచ్చాయి. ఆ పెద్దాయన వివిధ రకాల మొలకలతో ఆరోగ్యకరమైన చాట్‌ను తయారు చేస్తున్నాడు. దానికోసం ఉడకబెట్టిన నల్లశెనగ, మొలకెత్తిన శెనగ, మూంగ్ డాల్, మొలకెత్తిన మెంతి గింజలు, ఉడికించిన మటర్, వేయించిన వేరుశెనగలను ఉపయోగిస్తున్నాడు. చివరికి వీటిపై తురిమేసిన ముల్లంగి ఆకులు, పచ్చిమిర్చి, నిమ్మరసాన్ని చల్లాడు. ఇక ఈ చాట్ చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. ఒక్కసారైనా తినాల్సిందేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??