Viral Video: సముద్రంలో సునీతను చుట్టుముట్టిన డాల్ఫిన్స్.. వెల్‌కమ్ పార్టీ అంటూ నెటిజన్స్ కామెంట్స్
సునీత విలియమ్స్ వచ్చేశారు. భూమ్మీదకు దిగి వచ్చిన వెంటనే ఆమె చిరుదరహాసంతో అభివాదం చేశారు. నాసా, స్పేస్‌ఎక్స్ సాయంతో ఆమె 9 నెలల తర్వాత తిరిగొచ్చారు. 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫ్లోరిడా దగ్గర లోని సముద్ర జలాల్లో క్రూడ్రాగన్ ల్యాండ్ అయింది. ఆ వెంటనే వారిని ప్రత్యేక వాహనంలో నాసా సెంటర్‌కు తరలించారు. అయితే స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్లోరిడా సముద్రంలో దిగిన వీడియో వైరల్‌గా మారింది. అంతకన్నా ఎక్కువగా వ్యోమగాములు వచ్చిన క్రూ డ్రాగన్ చుట్టూ

సునీత విలియమ్స్ వచ్చేశారు. భూమ్మీదకు దిగి వచ్చిన వెంటనే ఆమె చిరుదరహాసంతో అభివాదం చేశారు. నాసా, స్పేస్‌ఎక్స్ సాయంతో ఆమె 9 నెలల తర్వాత తిరిగొచ్చారు. 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫ్లోరిడా దగ్గర లోని సముద్ర జలాల్లో క్రూడ్రాగన్ ల్యాండ్ అయింది. ఆ వెంటనే వారిని ప్రత్యేక వాహనంలో నాసా సెంటర్‌కు తరలించారు.
అయితే స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్లోరిడా సముద్రంలో దిగిన వీడియో వైరల్‌గా మారింది. అంతకన్నా ఎక్కువగా వ్యోమగాములు వచ్చిన క్రూ డ్రాగన్ చుట్టూ సముద్రంలో డాల్ఫిన్‌లు చుట్టుముట్టిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్, విల్మోర్‌బుచ్‌లకు సముద్రపు జీవులు పలికిన స్వాగతంగా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు.
ఎలోన్ మస్క్ పోస్ట్ చేసిన వీడియోలో, షటిల్ నీటిలో దిగిన వెంటనే డాల్ఫిన్లు దానిని చుట్టుముట్టడాన్ని మనం చూడవచ్చు. క్యారియర్ షటిల్ సముద్రంలో దిగినప్పుడు చేపల ప్రతిస్పందన నెట్టింట్లో ఆసక్తికర చర్చగా మారింది. వీడియోలో సముద్రంలో దిగిన షటిల్‌ను పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా డాల్ఫిన్లు షటిల్ చుట్టూ కనిపించాయి.
ఈ క్రమంలో ల్యాండింగ్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అంతరిక్ష వ్యోమగాముల గురించి డాల్ఫిన్లు ఆందోళన చెందినట్లుగా ఉందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ల్యాండింగ్ ప్రక్రియ చరిత్ర పుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని దానికి డాల్ఫిన్లే సాక్ష్యమని స్పందిస్తున్నారు.
వీడియోలు చూడండి:
Congratulations to the @SpaceX and @NASA teams for another safe astronaut return!
Thank you to @POTUS for prioritizing this mission! https://t.co/KknFDbh59s
— Elon Musk (@elonmusk) March 18, 2025
There are a bunch of dolphins swimming around SpaceX’s Dragon capsule. They want to say hi to the Astronauts too! lol pic.twitter.com/sE9bVhgIi1
— Sawyer Merritt (@SawyerMerritt) March 18, 2025