Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!

ఆప్టికల్‌ ఇల్యూషన్లు మన మెదడును మోసం చేస్తూ మన పరిశీలనా శక్తిని పరీక్షించేవి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక పజిల్‌ ను మీ ముందుకు తీసుకొచ్చాను చూడండి. పిల్లల గదిలో దాగి ఉన్న టూత్‌ బ్రష్‌ను 5 సెకండ్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. 99 శాతం మంది దీనిని కనుక్కోలేకపోయారు. మరి మీరు ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయగలరా..?

Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion
Follow us
Prashanthi V

|

Updated on: Mar 20, 2025 | 7:10 PM

నేటి ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఆసక్తికరంగా ఉంటుంది. పిల్లల గదిలో ఓ టూత్‌ బ్రష్‌ దాగి ఉంది. కానీ చాలా మందికి అది కనిపించటం లేదు. సోషల్‌ మీడియాలో ఈ పజిల్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. అయితే 99 శాతం మంది ఈ బ్రష్‌ ఎక్కడుందో కనుక్కోలేకపోయారు. మరి మీరు కనిపెట్టగలరా..? మీ పరిశీలనా శక్తిని పరీక్షించుకునేందుకు ఇది అద్భుతమైన అవకాశం.

ఆప్టికల్‌ ఇల్యూషన్లు మన దృష్టిని పరీక్షిస్తూ మెదడును మోసం చేసే ఆసక్తికరమైన దృశ్య ప్రదర్శనలు. ఇవి మన పరిశీలనా శక్తిని పెంచడమే కాకుండా మెదడుకు మంచి వ్యాయామాన్ని అందిస్తాయి.

Optical Illusion

ఇమేజ్‌ను మరోసారి శ్రద్ధగా పరిశీలించండి. ఇందులో ఒక చిన్నారి గదిలో ఉంటుంది. కర్లీ రెడ్‌ హెయిర్‌ ఉన్న బిడ్డ, బంగారు ఫ్రేమ్‌తో ఉన్న బెడ్‌లో నీలి బెడ్డింగ్‌తో నిద్రిస్తుంది. విండో ద్వారా చంద్రుడు, మెరిసే నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కిటికీకి ఆరెంజ్‌ కలర్‌ కర్టెన్స్‌ రెండువైపులా చుట్టబడ్డాయి.

ఈ గది పింక్‌ వాల్‌, రెడ్డిష్‌ పర్పుల్‌ ఫ్లోర్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కుడివైపు గ్రీన్‌ కలర్‌ బెడ్‌సైడ్‌ టేబుల్‌, దానిపై యెల్లో షేడ్‌ ఉన్న ల్యాంప్‌ ఉంది. పక్కనే బుక్‌ షెల్ఫ్‌లో పుస్తకాలు, కోడి ఆకారంలోని స్టఫ్డ్‌ టాయ్‌ వంటి వస్తువులు ఉన్నాయి. అయితే ఈ సాధారణంగా అనిపించే గదిలో ఎక్కడో ఓ చోట టూత్‌ బ్రష్‌ దాగి ఉంది. మీరు దాన్ని 5 సెకండ్లలో కనుగోనాల్సి ఉంటుంది.

ఆప్టికల్‌ ఇల్యూషన్లు మన దృష్టి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి చిన్న చిన్న వివరాలను గమనించే తత్వాన్ని పెంచి మెదడుకు కొత్త ఆలోచన శక్తిని ఇస్తాయి.

ఇంతకీ మీరు టూత్‌ బ్రష్‌ కనిపెట్టారా..? లేక ఇంకా వెతుకుతున్నారా..? వెతికినా దొరకడం లేదంటే.. కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. బ్రష్‌ను కనిపెట్టినవారికి అభినందనలు. ఇంకా కనుగొనలేకపోతే టెన్షన్‌ పడకండి. నేను వెతికిపెట్టానుగా మీకోసం. ఇమేజ్‌లో సర్కిల్ చేసి ఉంది. ఆ సర్కిల్ లోనే బ్రెష్ ఉంది చూడండి. ఇంట్లో పిల్లల అల్లరి ఎక్కువ కదా.. ఏది ఎక్కడ పెడుతారో తెలియదు. ఏదైనా ఒక్కచోట ఉంచుతారా.. చెప్పండి. బ్రష్ ను కూడా విడిచిపెట్టకుండా ఇక్కడ దాచారు.

Optical Illusion 1