AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: తోటి కుక్కకు అంత్యక్రియలు చేసిన మిగిలిన కుక్కలు.. హృదయాని హత్తుకుంటున్న వీడియో

మనిషికి, కుక్కలకు చాలా దగ్గరి అనుబంధం ఉంటుంది. మనుషుల లాగే ఇవి కూడా తెలివైనవి. మనుషులు చేసే పనులను చూస్తూ అవి చాలా విషయాలు తెలుసుకుంటాయి.

Viral video: తోటి కుక్కకు అంత్యక్రియలు చేసిన మిగిలిన కుక్కలు.. హృదయాని హత్తుకుంటున్న వీడియో
Dog
Rajeev Rayala
|

Updated on: May 03, 2022 | 7:00 AM

Share

Viral video: నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తారసపడుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవె ఎక్కువ ఉంటాయి. కొన్ని వీడియోలు భయపెడితే.. చాలా వీడియాలు ఫన్నీగా అనిపిస్తుంటాయి. మరికొన్ని మాత్రం హృదయానికి హత్తుకుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. మనిషికి, కుక్కలకు చాలా దగ్గరి అనుబంధం ఉంటుంది. మనుషుల లాగే ఇవి కూడా తెలివైనవి. మనుషులు చేసే పనులను చూస్తూ అవి చాలా విషయాలు తెలుసుకుంటాయి. అలా కొన్ని కుక్కలు కలిసి.. తమతో అప్పటివరకూ జీవించిన మరో కుక్కకు స్వయంగా అంత్యక్రియలు జరిపాయి. ఆ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక్కడ చాలా కుక్కలు కలిసి ఓ చనిపోయిన కుక్కను స్వయంగా పాతిపెట్టడం కనిపిస్తుంది. మరణించిన కుక్క గొయ్యిలో ఉండగా..బయట చుట్టుముట్టిన కుక్కలు మట్టి పోసి పాతిపెట్టాయి. చనిపోయిన కుక్కపట్ల తోటి శునకాలు బాధలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎంతో ఎమోషనల్‌గా ఉన్న ఈ వీడియో నెటిజన్లను సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది. వీడియోకు రకరకాల కామెంట్‌ వస్తున్నాయి. 7సాధారణంగా కుక్కలు తమ ముందు కాళ్లతో మట్టిని తవ్వుతాయి. ఇప్పుడు ఇక్కడ మట్టిని పోస్తున్నాయి. తమ తోటి ఫ్రెండ్ చనిపోయిన విషయాన్ని గుర్తించి గౌరవం ఇస్తున్నాయి. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

LIC IPO: నేటి నుంచి ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం.. పాల్గొనేందుకు ముందుగా వారికే అవకాశం..

Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..