Funny Video: సాధారణంగా గొర్రెల మందకు కాపాలాగా కాపలాదారుడు ఉంటాడు. ఆ కాపలాదారుడి వెంట ఓ కుక్క కూడా ఉంటుంది. ఎందుకంటే.. కుక్కలపై ఏ ఇతర జంతువు దాడి చేయకుండా అది కాపాడుతుంది. అయితే, గొర్రెలను దొడ్లోకి తీసుకొచ్చాక కూడా ఆ కుక్కను కాపాలాగా కట్టేస్తారు యజమానులు. అయితే, కొన్నికొన్నిసార్లు గొర్రెలు అతి తెలివి ప్రదర్శిస్తాయి. కొంచెం సందు దొరికితే చాలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. అయితే, వాటిని మించిన కంచు ఇక్కడ ఉన్న కుక్క. ఆ గొర్రెలు కంచె దాటికి బయటకు వెళ్లకుండా పకడ్బందీగా ప్లాన్ వేసింది. గొర్రెల్లో గొర్రెగా మారింది. వాటికి అనుమానం రాకుండా గొర్రె తోలు లాంటి గొంగడి ముసుగు వేసుకుంది. కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ముసుగు వేసుకుని, గొర్రెలను కాపలాకాస్తోంది. గొర్రెలు కదిలితే చాలు.. అదిలిస్తున్నట్లుగా కోపంతో చూస్తోంది. గొర్రె ముసుగులో ఉన్న ఈ కుక్కను చూసి.. నిజమైన గొర్రెలు భయపడిపోతున్నాయి. అడుగు ముందుకు వెయాలంటేనే జంకుతున్నాయి. అయితే, గొర్రెలో గొర్రెగా మారిన కంత్రీ కుక్కకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దాని తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
Secretly supervising..🐑🐕🐑😅 pic.twitter.com/4A2NwiuGOR
— 𝕐o̴g̴ (@Yoda4ever) August 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..