తనను ఇంటర్వ్యూ చేస్తోన్న రిపోర్టర్‌కు షాక్ ఇచ్చిన కుక్క

తనను ఇంటర్వ్యూ చేస్తోన్న రిపోర్టర్‌కు షాక్ ఇచ్చిన కుక్క

మనుషులను ఇంటర్వ్యూ చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో తెలీదు కానీ ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన ఓ కుక్కను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లాడు ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్. వెళ్లగానే కుక్కను ప్రశ్నలు అడగడం కూడా ప్రారంభించేశాడు. అయితే ఆ శునకం ఏమనుకుందో ఏమో కానీ వెంటనే రిపోర్టర్‌కు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://www.instagram.com/p/BuuwM45h8f0/ వివరాల్లోకి వెళ్తే.. పెర్త్‌లో స్టాన్‌‌లీ అనే కుక్క టెన్నిస్ బాల్‌లను పట్టుకోవడంలో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 25, 2019 | 1:37 PM

మనుషులను ఇంటర్వ్యూ చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో తెలీదు కానీ ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన ఓ కుక్కను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లాడు ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్. వెళ్లగానే కుక్కను ప్రశ్నలు అడగడం కూడా ప్రారంభించేశాడు. అయితే ఆ శునకం ఏమనుకుందో ఏమో కానీ వెంటనే రిపోర్టర్‌కు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://www.instagram.com/p/BuuwM45h8f0/

వివరాల్లోకి వెళ్తే.. పెర్త్‌లో స్టాన్‌‌లీ అనే కుక్క టెన్నిస్ బాల్‌లను పట్టుకోవడంలో పట్టు సాధించింది. అలా స్టాన్‌లీ టెన్నిస్ బాల్‌లను పట్టుకుంటోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో స్థానిక టీవీ రిపోర్టర్ స్టాన్‌లీని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లాడు. వెళ్లిందే తడావుగా.. ‘ఈ కీర్తిని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు’’ అంటూ స్టాన్‌లీని ప్రశ్నించాడు. వెంటనే మైక్‌కు ఉన్న స్పాంజ్‌ను లాగిన స్టాన్‌లీ అక్కడి నుంచి పరుగులు తీసింది. దీంతో ఆ రిపోర్టర్ తన నవ్వును ఆపుకోలేకపోయాడు.

https://www.instagram.com/p/BvTQA1JFxKq/?utm_source=ig_embed

దీనికి సంబంధించిన ఫొటోను ఆ ఛానెల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ‘‘హే స్టాన్‌లీ ఆ స్పాంజ్‌ను తినకు. అది నీకు మంచిది కాదు. టెన్నిస్ బంతితో ఆడుకో’’ అంటూ కామెంట్ పెట్టింది. మరోవైపు స్టాన్‌లీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా ఉండగా.. అందులో ‘‘మీడియా దగ్గర ఎలా మెలాగాలో స్టాన్‌లీకి ట్రైనింగ్ అవసరం’’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu