గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్‌ను చూసారా ??
నయాగరా జలపాతం అమెరికాలో తీవ్ర శీతల వాతావరణం కారణంగా పాక్షికంగా గడ్డకట్టింది. పోలార్ వోర్టెక్స్ ప్రభావంతో మైనస్ 20°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లక్షలాది లీటర్ల నీరు గడ్డకట్టినప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. ఈ అద్భుత దృశ్యం 'వింటర్ వండర్ ల్యాండ్'గా మారి పర్యాటకులను ఆకర్షిస్తోంది. నెటిజన్లు వీడియోలు చూసి ఆశ్చర్యపోతున్నారు.
జలపాతం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నయాగరా ఫాల్సే. అమెరికా-కెనడా దేశాల మధ్య నయాగరా నదిపై జలపాతం అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా ఫాల్స్ ముందుంటుంది. అమెరికాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నయాగరా అందాలను చూడకుండా రారు. కొండల మధ్య నుంచి నీరు అలా కిందకు దూకుతుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. అంతటి పేరున్న జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. విపరీతంగా మంచు కురుస్తోంది. మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఎటుచూసినా మంచు గడ్డలే దర్శనమిస్తున్నాయి. నదులు, సరస్సుల్లోని నీరు గడ్డకట్టుకుపోయింది. అంతేకాకుండా పోలార్ వోర్టెక్స్ వద్ద ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో నయాగరా జలపాతం ఫ్రీజ్ మోడ్‌లోకి వెళ్లింది. నయాగరా అందాలు సైతం గడ్డ కట్టుకుపోయి పర్యాటకులకు ఆహ్వానిస్తోంది. కింద గర్జించే నీరు, పైన నిశ్శబ్దం, గడ్డకట్టిన ప్రపంచం. మందంగా మంచు పేరుకుపోయినప్పటికీ జలపాతం హోరు మాత్రం ఆగలేదు.నయాగరా జలపాతం గడ్డకట్టినప్పటికీ ప్రతి సెకనుకు లక్షలాది లీటర్ల నీరు అంచుల నుంచి ఉప్పొంగుతూనే ఉంది. శీతలగాలులు, పొగమంచుకి విరుద్ధంగా ప్రవహిస్తున్న నీరు, ఘనీభవించిన ఉపరితలం పక్క పక్కనే కనిపించేసరికి వీడియోలు నెట్టింట సందడిగా మారాయి. ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నయాగరా జలపాతం కాస్తా వింటర్ వండర్ ల్యాండ్ గా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గడ్డకట్టిన నయాగరా అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
ONGC పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్‌ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా
తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

