AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే

ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే

Phani CH
|

Updated on: Feb 01, 2026 | 4:16 PM

Share

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలలో టేబుల్‌టాప్ రన్‌వేలు ప్రముఖంగా ఉన్నాయి. బారామతి, మంగళూరు, కోజికోడ్ వంటిచోట్ల ఈ రన్‌వేలు ప్రమాదాలకు కారణమయ్యాయి. కొండ ప్రాంతాలు లేదా లోయల మధ్య నిర్మించే ఈ విమానాశ్రయాల్లో గాలుల తీవ్రత ఎక్కువ, ల్యాండింగ్ కష్టం. భూటాన్ లోని పారో, నేపాల్ లోని టెన్జింగ్-హిల్లరీ వంటి ఎత్తైన, చిన్న రన్‌వేలు సైతం పైలట్లకు పెద్ద సవాలును విసురుతాయి. అపార అనుభవం గల పైలట్లు మాత్రమే వీటిని సమర్థవంతంగా నిర్వహించగలరు, లేదంటే ఘోర ప్రమాదాలు తప్పవు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిన బారామతిలో టేబుల్ టాప్ రన్ వే ఉంది. బారామతి విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. కొండ ప్రాంతాలను చదును చేసి.. లేదా లోయల మధ్య ఎత్తైన పీఠభూమిపై నిర్మించే రన్‌వేలను టేబుల్‌టాప్ రన్‌వేలు అని పిలుస్తారు. అంతేకాకుండా ఇలాంటి విమానాశ్రయాలు.. ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించడం వల్ల గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టం. టేబుల్‌టాప్ విమానాశ్రయం మంగళూరు ఎయిర్‌పోర్టులో కూడా ఉంది. 2010లో విమానం రన్‌వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది దుర్మరణం చెందారు. 2020లో కోజికోడ్‌ టేబుల్‌ టాప్‌పై భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్‌వేను దాటి 35 అడుగుల లోతు లోయలో పడి రెండు ముక్కలు అయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. భూటాన్ లోని పారో ఎయిర్‌పోర్ట్‌ 18,000 అడుగుల ఎత్తు చుట్టూ పర్వతాలతో ఉంటుంది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విమానాశ్రయంగా పరిగణిస్తారు. రన్‌వేపైకి దిగే ముందు పైలట్లు.. పదునైన కోణాల్లో పర్వతాల మధ్య నుంచి రావాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని విమానాలూ దిగలేవు. కొన్నింటిని మాత్రమే అనుమతిస్తారు. ఎవరెస్ట్‌కు వెళ్లే ఎంట్రీ మార్గంలో నేపాల్ లోని టెన్జింగ్-హిల్లరీ విమానాశ్రయానికి కేవలం 527 మీటర్ల పొడవున్న రన్‌వే ఉంది. రెండు చివర్లలో కొండలతో వాలుగా ఉంటుంది. చుట్టూ హిమాలయ భూభాగం ఉంటుంది. విమానాలు రన్ వే పై స్వేచ్ఛగా తిరగడానికి స్థలం లేదు. పైలెట్లు చాలా ఇబ్బంది పడతారు. ఇలాగే ప్రపంచంలోని మరికొన్ని ఎయిర్‌పోర్ట్‌లలో ల్యాండింగ్ పైలట్లకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న పైలెట్లు కూడా.. ప్రతిసారీ సవాలును ఎదుర్కొంటారు. సాధారణంగా చాలా వరకు ప్రమాదాలు.. పైలెట్ల అనుభవం, చాకచక్యత వల్ల తప్పుతూ ఉంటాయి. పర్వతాలు, మహాసముద్రాలు లేదా చాలా చిన్న రన్‌వేలతో ఉండే విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఘోర ప్రమాదం తప్పదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

ONGC పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు

వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా

Follow Us