AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం: నిలుచోబెట్టి కాన్పు చేసి.. నరకం చూపించారు

వైద్యులు.. దేవుళ్ళతో సమానం అని అంటారు. ఇక వైద్యం అనేది ప్రతీ మనిషి ప్రాధమిక హక్కులో భాగం. అలాంటిది గుజరాత్ కు చెందిన కొంతమంది వైద్యులు ఒక మహిళ పట్ల అత్యంత హేయంగా వ్యవహరించారు. కాన్పు కోసం వచ్చిన మహిళను నిల్చోబెట్టి మరి ప్రసవం చేశారు. నవమాసాలు మోసిన బిడ్డను కళ్లారా చూసుకోవాలని ఆశించిన ఆ మహిళకు నరకం చూపించి మరి కాన్పు చేశారు ఆసుపత్రి సిబ్బంది. అసలు వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో […]

దారుణం: నిలుచోబెట్టి కాన్పు చేసి.. నరకం చూపించారు
Ravi Kiran
|

Updated on: Mar 25, 2019 | 3:02 PM

Share

వైద్యులు.. దేవుళ్ళతో సమానం అని అంటారు. ఇక వైద్యం అనేది ప్రతీ మనిషి ప్రాధమిక హక్కులో భాగం. అలాంటిది గుజరాత్ కు చెందిన కొంతమంది వైద్యులు ఒక మహిళ పట్ల అత్యంత హేయంగా వ్యవహరించారు. కాన్పు కోసం వచ్చిన మహిళను నిల్చోబెట్టి మరి ప్రసవం చేశారు. నవమాసాలు మోసిన బిడ్డను కళ్లారా చూసుకోవాలని ఆశించిన ఆ మహిళకు నరకం చూపించి మరి కాన్పు చేశారు ఆసుపత్రి సిబ్బంది.

అసలు వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో రామీ బెన్ అనే మహిళ నెలలు నిండడంతో తన అత్తగారితో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అయితే అక్కడ ఉన్న నర్సు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. రామీ బెన్ ను ఓ ఇనుప కడ్డీ పట్టుకోమని చెప్పి అక్కడిక్కడే పురుడు పోసిందట. అంతేకాదు ప్రసూతి తాలూకు రక్తాన్ని కూడా రామీ బెన్ చీరతోనే తుడిపించి మానవత్వాన్ని కించపరిచేలా చేసిందట. ఇక ఈ విషయం తెలుసుకున్న రామీబెన్ బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్ ఇలాంటి అమానవీయ ఘటనలు తమ ఆసుపత్రిలో ఎప్పుడూ జరగలేదని తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం గతంలోనూ ఇలాంటి ఘటనలు ఈ ఆసుపత్రిలో జరిగాయని ఆరోపిస్తున్నారు.

Follow Us