AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలకు నూనె రాసేటప్పుడు ఈ తప్పులు చేశారో ఉన్న జట్టు ఊడిపోవడం ఖాయం.. ఈ నిజాలు తెలుసుకోండి..

అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల నూనెలను జుట్టుకు పట్టిస్తుంటారు. కానీ కేవలం మంచి నూనెను ఎంచుకుంటే సరిపోదు, దానిని అప్లై చేసే విధానం కూడా సరైనదై ఉండాలి. లేదంటే చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆ చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తలకు నూనె రాసేటప్పుడు ఈ తప్పులు చేశారో ఉన్న జట్టు ఊడిపోవడం ఖాయం.. ఈ నిజాలు తెలుసుకోండి..
How To Apply Hair Oil Correctly
Krishna S
|

Updated on: Jun 20, 2026 | 9:57 PM

Share

జుట్టును బలంగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నూనె రాసుకోవడం మన అమ్మమ్మల కాలం నాటి నుండి వస్తున్న ఒక మంచి సంప్రదాయం. నూనె రాయడం వల్ల తల చర్మానికి అద్భుతమైన తేమ అంది, జుట్టు పొడిబారడాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ హెయిర్ ఆయిలింగ్ చేసుకునేటప్పుడు చాలా మంది కొన్ని రకాల పొరపాట్లు చేస్తుంటారు. తప్పుడు పద్ధతిలో లేదా తప్పుడు సమయంలో నూనె రాస్తే.. అది జుట్టు సమస్యలను తగ్గించాల్సింది పోయి మరింత తీవ్రతరం చేస్తుందని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి జుట్టుకు నూనె రాసేటప్పుడు అస్సలు చేయకూడని ఆ 4 తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రంతా నూనెను అలాగే ఉంచుకోవడం

చాలా మంది రాత్రి పూట తలకు నూనె రాసుకుని ఉదయం స్నానం చేస్తుంటారు. ప్రతి ఒక్కరి జుట్టు, తల చర్మం అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఇప్పటికే జిడ్డుగల తల చర్మం లేదా చుండ్రు సమస్య ఉంటే.. రాత్రంతా నూనెను తలపై అలాగే ఉంచడం వల్ల ఆ జిడ్డుకు ధూళి చేరి చుండ్రు సమస్య మరింత ఎక్కువవుతుంది. కాబట్టి స్నానానికి కొన్ని గంటల ముందు నూనె రాసుకుంటే తల చర్మానికి నూనెను పీల్చుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది.

నూనె రాశాక బలంగా మసాజ్ చేయడం

నూనె రాసుకునేటప్పుడు జుట్టు కుదుళ్లకు బాగా పట్టాలనే ఉద్దేశంతో చాలా మంది తల చర్మాన్ని చాలా బలంగా, గట్టిగా మసాజ్ చేస్తుంటారు. దీనివల్ల జుట్టు కుదుళ్లపై విపరీతమైన ఒత్తిడి పడి, వెంట్రుకలు సులభంగా విరిగిపోవడం, రాలడం పెరుగుతుంది. నూనె రాసేటప్పుడు ఎప్పుడైనా సరే వేలి కొనలతో తల చర్మాన్ని చాలా సున్నితంగా మాత్రమే మసాజ్ చేయడం ఉత్తమం.

తడి జుట్టుకు నూనె రాయడం

స్నానం చేసిన వెంటనే లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు నూనె రాయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే తడి జుట్టు చాలా పెళుసుగా ఉండి, కాస్త ఒత్తిడి పడినా సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంది. పైగా తడిపై నూనె రాస్తే తలలో తేమ అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. అందుకే నూనె రాసే ముందు జుట్టును పూర్తిగా ఆరనివ్వడం చాలా అవసరం.

మరీ ఎక్కువగా నూనెను గుమ్మరించడం

ఎక్కువ నూనె రాసుకుంటే జుట్టు అంత ఎక్కువగా బలపడుతుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇందులో నిజం లేదు. అధికంగా నూనె రాయడం వల్ల తల చర్మం విపరీతమైన జిగురుగా మారుతుంది. ఆ జిడ్డును వదిలించుకోవడానికి తల స్నానం చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో కెమికల్స్ ఉన్న షాంపూలను వాడాల్సి వస్తుంది. దీనివల్ల జుట్టులోని సహజ నూనెలు కోల్పోయి, జుట్టు రాలడం మరింత పెరుగుతుంది.

ఏ నూనె వాడాలి? సరైన సంరక్షణ ఏది?

సాధారణంగా కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనెలను జుట్టుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే మీ జుట్టు రకం, మీ తల చర్మం తత్వాన్ని బట్టి మీకు ఏ నూనె సెట్ అవుతుందో దాన్ని ఎంచుకోవాలి. అంతేకాకుండా కేవలం పైన నూనె రాయడం వల్ల మాత్రమే జుట్టు సమస్యలన్నీ పరిష్కారం కావు. దాంతో పాటుగా విటమిన్లు ఉన్న సరైన ఆహారం, తగినంత నిద్ర, మంచి జీవనశైలి కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మీకు విపరీతంగా జుట్టు రాలుతున్నా లేదా తలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నా వెంటనే నిపుణులును సంప్రదించడం మంచిది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం, సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ జుట్టు సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నా, లేదా విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతున్నా సొంత వైద్యం కాకుండా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us