షుగర్ పేషెంట్లు అరటి పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

 Krishna

20 June 2026

మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. అయితే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకుని, తినే విధానం, పరిమాణంపై జాగ్రత్త వహించాలి.

పరిమాణం

బాగా పండిన అరటిపండ్లలో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. అందుకే సగం లేదా పండకముందే తినడం మంచిది.

పండిన అరటిపండ్లు

పండిన వాటి కంటే పచ్చి అరటిపండ్లు మధుమేహ రోగులకు ఎక్కువ మేలు చేస్తాయి. వీటిలో రెసిస్టెంట్ స్టార్చ్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవి త్వరగా జీర్ణం కావు.

పచ్చి అరటిపండ్లు

పచ్చి అరటిపండ్లు నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలోకి గ్లూకోజ్ చేరే వేగం తగ్గుతుంది. ఇవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో కూడా ఎంతగానో సహాయపడతాయి.

ఇన్సులిన్ నిరోధకత

డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో అరటిపండును చేర్చుకునే ముందు రోజంతా తాము తీసుకునే మొత్తం కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పండిన పండు ఒక చిన్న ముక్కను ఉదయాన్నే చిరుతిండిగా తీసుకోవచ్చు.

కార్బోహైడ్రేట్ల లెక్కింపు

అరటిపండ్లను ఒంటరిగా తినడానికి బదులుగా.. వాటితో పాటు కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు లేదా తక్కువ కొవ్వు ఉన్న పెరుగును కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సెడన్‌గా పెరగకుండా నివారించవచ్చు.

కాంబినేషన్ ఆహారాలు

 పచ్చి అరటిపండ్లను ఉడకబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిది. లేదా వీటిని కొద్దిగా నూనెలో వేయించుకుని చిరుతిండిగా గానీ, తురుము రూపంలో గానీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

వండుకునే విధానం

మధుమేహ వ్యాధిగ్రస్తులు నెయ్యిలో వేయించిన అరటిపండ్లను లేదా బనానా బ్రెడ్‌ను పూర్తిగా మానుకోవాలి. అలాగే జ్యూస్ తాగకూడదు.అలా చేయడం వల్ల పీచుపదార్థం నశించి చక్కెర త్వరగా శరీరంలోకి శోషించబడుతుంది.

వీటికి దూరం