AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దేశాన్నివణికించిన క్రైమ్.. OTTని షేక్ చేస్తోన్నరియల్ స్టోరీ.. గ్లోబల్ వైడ్‌ ట్రెండింగ్‌లో నెంబర్ వన్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్రైమ్ వెబ్ సిరీస్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: దేశాన్నివణికించిన క్రైమ్.. OTTని షేక్ చేస్తోన్నరియల్ స్టోరీ.. గ్లోబల్ వైడ్‌ ట్రెండింగ్‌లో నెంబర్ వన్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 20, 2026 | 9:53 PM

Share

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. అందులోనూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన రియల్ స్టోరీలకైతే ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ ఉంటోంది. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఇటీవల స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ క్రైమ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీలో రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా అలాగే సోషల్ మీడియాలోనూ ఈ సిరీస్ గురించే విపరీతమైన చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. గతంలో దేశాన్ని వణికించిన ఓ క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించడం. ఆసక్తికరమైన కథా కథనాలు, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు ఇంటర్నేషన్ స్థాయిలోనూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ దక్కడం గమనార్హం. మరి ఇన్ని సంచలనాలు సృష్టిస్తోన్న ఈ వెబ్ సిరీస్ లో ఏముంది? అసలు స్టోరీ ఏంటి? అనే విషయానికి వస్తే..

అది 1978.. దేశ రాజధాని ఢిల్లీ లో ఓ ప్రముఖ అధికారి పిల్లలు ఇద్దరు ఒకే రోజు అదృశ్యం అవుతారు. కట్ చేస్తే.. ఆ మరుసటి రోజు పిల్లలిద్దరూ అడవిలో శవాలుగా కనిపిస్తారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తుంది. మరి ఆ ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా చంపిందెవరు? ఎందుకు ఈ హత్యలు చేశారు? పోలీసులు ఆ క్రిమినల్స్ ను ఎలా పట్టుకున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

1978లో దేశాన్ని వణికించిన బిల్లా- రంగ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పేరు రాఖ్. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీ ఫజల్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఆమిర్ బషీర్, దివ్యా శర్మ తదితరులు  కీలక పాత్రలు పోషించారు.  పాతాళ్ లోక్ సిరీస్ ఫేం ప్రొసిత్ రాయ్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ లో రాఖ్ వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు