AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఒక్కొక్కరికి బోనస్ ఎంతో తెలుసా..?

Singareni Bonus 2026: దసరా, దీపావళి పండుగల వేళ సింగరేణి కార్మికులకు కేంద్రం తీపి కబురు అందించింది. Performance Linked Reward కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌ చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గతేడాది రూ.1,03,000తో పోలిస్తే ఈసారి బోనస్ పెరిగింది.

సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఒక్కొక్కరికి బోనస్ ఎంతో తెలుసా..?
Singareni Workers Bonus
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2026 | 7:57 AM

Share

హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికులకు దసరా, దీపావళి పండుగల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రదర్శన అనుసంధానిత ప్రోత్సాహకం (Performance Linked Reward – PLR) కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ. 1,10,250 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదంటూ కిషన్ రెడ్డి.. ఎక్స్‌ వేదికగా కొనియాడారు. సింగరేణి అనేది బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమంటూ కేంద్రమంత్రి పేర్కొన్నారు.

భూగర్భంలో అహోరాత్రులు శ్రమిస్తూ దేశానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల కృషి వెలకట్టలేనిదని వివరించారు. గతేడాది చెల్లించిన రూ. 1,03,000 కంటే ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచారు. కాగా.. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ. 60,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

‘‘రానున్న దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్‌ ఇవ్వాలని నిర్ణయమైనది. దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి పరిశ్రమ మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి.. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాను. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నాను..’’ అంటూ కిషన్ రెడ్డి ట్వట్ చేశారు.

పండుగల సీజన్‌లో భారీ బోనస్ ప్రకటన వెలువడటంతో సింగరేణి బొగ్గు గనుల పరిధిలో ముందస్తు పండుగ వాతావరణం నెలకొంది.

Follow Us
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..