AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Open: కంట్రోల్ తప్పిన మెద్వెదేవ్ కోపం.. గ్యాలరీలో అభిమానికి బంతి తగలడంతో వేటు

China Open: చైనా ఓపెన్ సెమీఫైనల్‌లో రష్యా టెన్నిస్ స్టార్ డానియెల్ మెద్వెదేవ్ డిస్‌క్వాలిఫై అయ్యాడు. జకోవిచ్‌తో మ్యాచ్ సందర్భంగా కోపంతో కొట్టిన బంతి ప్రేక్షకుని కంటికి తాకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనపై మెద్వెదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు

China Open: కంట్రోల్ తప్పిన మెద్వెదేవ్ కోపం.. గ్యాలరీలో అభిమానికి బంతి తగలడంతో వేటు
Daniil Medvedev
Rakesh
|

Updated on: Oct 06, 2026 | 7:52 AM

Share

China Open: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రష్యా టెన్నిస్ స్టార్ నికోలాయ్ డానియెల్ మెద్వెదేవ్ తీవ్ర కోపంతో విసిరిన బంతి ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఒక అభిమాని కంటికి బలంగా తాకింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు మెద్వెదేవ్‌ను టోర్నీ నుంచి డిస్‌క్వాలిఫై చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కోపంలో బంతిని బాది వివాదంలోకి

సెమీఫైనల్‌లో నోవాక్ జకోవిచ్‌తో జరుగుతున్న తీవ్రమైన పోరులో మెద్వెదేవ్ 7-5, 5-3 తేడాతో వెనుకబడి ఉన్నాడు. ఓ పాయింట్ కోల్పోవడంతో తీవ్ర అసహనానికి గురైన అతను, వెనుక గోడను తాకి వచ్చిన బంతిని కోపంతో గట్టిగా కొట్టాడు. ఆ బంతి నేరుగా మొదటి వరుసలో కూర్చున్న ప్రేక్షకుని ఎడమ కంటికి బలంగా తగిలింది. ఆ అభిమాని కంటిని పట్టుకుని నొప్పితో అల్లాడిపోవడంతో మైదాన సిబ్బంది అతడిని బయటకు తీసుకువెళ్లారు.

మెద్వెదేవ్ క్షమాపణలు

ఈ అనూహ్య ఘటనపై మెద్వెదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అది పూర్తిగా అనుకోకుండా జరిగిన ప్రమాదమని, ఆ అభిమానికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని తెలిపాడు. బంతి కోర్ట్ బయటకు వెళ్లకుండా ఉండాలని మాత్రమే కొట్టానని, ఆ తర్వాత జరిగిన పరిణామం చూసి షాక్‌కు గురయ్యానని పేర్కొన్నాడు. జకోవిచ్ కూడా స్పందిస్తూ మెద్వెదేవ్ పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశాడు.

పాత వివాదాలు, క్రమశిక్షణా చర్యలు

మెద్వెదేవ్‌కు మైదానంలో కోపం రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతని ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అంపైర్ కెమెరాను రాకెట్‌తో పగలగొట్టి భారీ జరిమానా ఎదుర్కొన్నాడు. అలాగే యుఎస్ ఓపెన్‌లో కూడా అంపైర్‌ను దూషించి ఆడియెన్స్‌ను రెచ్చగొట్టడం వల్ల వేలాది డాలర్ల ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.

ఫైనల్‌కు దూసుకెళ్లిన జకోవిచ్, డి మినార్

మెద్వెదేవ్ అనర్హతకు గురవ్వడంతో నోవాక్ జకోవిచ్ నేరుగా ఫైనల్ చేరుకున్నాడు. మరో సెమీఫైనల్‌లో హుబెర్ట్ హుర్కాచ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడంతో ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ డి మినార్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. జపాన్ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాజ్ వరుస విజయాలతో ఫైనల్ చేరి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?