AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohsin Naqvi: భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం

Mohsin Naqvi : వరల్డ్ ఛాంపియన్‌ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీ లో భారత ఆటగాళ్లు రాతపూర్వక క్షమాపణ చెప్పాలని పీసీబీ షరతు విధించింది. ఈ డిమాండ్లను WCL నిర్వాహకులు తిరస్కరించడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు టోర్నీ నుంచి తప్పుకుంది.

Mohsin Naqvi: భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
Mohsin Naqvi
Rakesh
|

Updated on: Oct 06, 2026 | 8:10 AM

Share

Mohsin Naqvi: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ ప్రారంభానికి ముందే తీవ్ర వివాదం రేగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పెట్టిన విచిత్రమైన కండిషన్ల వల్ల పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. భారత క్రికెటర్లు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పి, మ్యాచ్ తర్వాత చేతులు కలుపుతామంటేనే తమ జట్టును ఆడనిస్తామని పీసీబీ షరతు విధించింది. ఈ డిమాండ్లను డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు తోసిపుచ్చడంతో పాకిస్తాన్ జట్టుకు ఎన్ఓసీ ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది.

క్షమాపణ చెప్తేనే ఆడతామంటూ పీసీబీ మెలిక

గత సీజన్‌లో ఇండియన్ ఛాంపియన్స్ జట్టు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లను బహిష్కరించడాన్ని పీసీబీ తీవ్రంగా పరిగణించింది. ఈసారి తమ జట్టును పంపాలంటే భారత ఆటగాళ్లు రాతపూర్వక క్షమాపణ పత్రం ఇవ్వాలని మొహ్సిన్ నఖ్వీ పట్టుబట్టారు. అంతేకాకుండా మ్యాచ్ ముగిశాక భారత ప్లేయర్లు తప్పనిసరిగా పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వాలని కండిషన్ పెట్టారు. దీనికి టోర్నీ యాజమాన్యం అంగీకరించకపోవడంతో పాక్ బోర్డు అనుమతి నిరాకరించింది.

బహిష్కరణకు దారితీసిన గతం

గతంలో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో 25 మంది భారతీయులతో పాటు ఒక నేపాల్ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఆ సమయంలో యువరాజ్ సింగ్ నాయకత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు, పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్ తో పాటు సెమీఫైనల్ పోరును కూడా ఆడేందుకు నిరాకరించి టోర్నీ నుంచి పక్కకు తప్పుకుంది.

ఏంటి ఈ షేక్ హ్యాండ్ వివాదం?

2025 ఆసియా కప్ సమయం నుంచి భారత క్రికెటర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో సాంప్రదాయక హ్యాండ్‌షేక్ చేయడం నిలిపివేశారు. ఆట మైదానంలోనూ, బయటా పాక్ ఆటగాళ్లకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని భారత జట్టు కొనసాగిస్తోంది. ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పీసీబీ, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందనే నెపంతో ఈసారి కొత్త షరతులను ముందుకు తెచ్చింది.

నిరాశలో పాకిస్తాన్ రిటైర్డ్ ప్లేయర్లు

పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు యజమాని కామిల్ ఖాన్ పీసీబీని ఎంత కోరినా బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మిస్బా ఉల్ హక్ వంటి దిగ్గజాలు ఆడే అవకాశం కోల్పోయారు. నిబంధనల ప్రకారం బోర్డు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, టోర్నీలో పాల్గొనలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ ఛాంపియన్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..