Honey Trailer: సరికొత్త కథతో రానున్న నవీన్ చంద్ర.. హనీ ట్రైలర్ అదిరిపోయిందిగా..!!
హనీ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ప్రేక్షకులకు చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర అన్నారు. మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో నవీన్ చంద్ర.

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మౌత్ టాక్ తో నిలబడే సినిమా. మాకు ఉన్న బడ్జెట్లో థియేటర్స్ కి తీసుకొచ్చి ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఫిబ్రవరి 6న దయచేసి ఒకసారి థియేటర్ కి రండి. ఇది థియేటర్ కి చాలా బాగుంటుంది. దివి చాలా అద్భుతమైన నటి. తను తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది. దివ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఆలోచన రేకెత్తించే సినిమా. డివోపి మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఇందులో ఉన్న పాప కూడా చాలా చక్కగా నటించింది. మట్కా సినిమా సమయంలో కరుణ కుమార్ గారితో చాలా దగ్గర ఆయను. ఈ కథకు ఆయన నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను అని అన్నారు.
అలాగే ఈ సమాజంలో ఆశ కోసం ప్రజలు ఏవేవో చేస్తున్నారు. ఇందులో ఒక డార్క్ సొసైటీని చూపించాము. ఈ కథ విన్న తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి మనం విక్టిమ్ అవుతాం. ఆనంద్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి కథలు మరిన్ని వస్తాయి. ఈ సినిమా చేసిన్నప్పుడు చాలా మ్యాడ్ నెస్ లో ఉన్నాను. చాలా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ సినిమా షూటింగ్లో ఒక సంఘటన జరిగింది. ఈ క్యారెక్టర్ ప్రభావం వల్ల ఒక వ్యక్తితో నేను దురుసుగా ప్రవర్తించాను. అయితే అది నేను కాదు. ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించింది. తప్పకుండా ఫిబ్రవరి 6న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు నవీన్ చంద్ర.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
