మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. రిపోర్ట్స్ చూసి వైద్యులు షాక్

ఓ మహిళ తల తిరగడం, చికాకుగా ఉండడం, మాట్లాడటం కష్టంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలో వచ్చిన రిపోర్ట్స్ చూసి ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని భావించారు. అయితే మరింత వివరాల కోసం వైద్యులు అదనపు పరీక్షలను చేయడానికి వెన్నెముకలోకి సూదిని చొప్పించినప్పుడు.. ఆమె మెదడులో బాలముతియా మాండ్రిల్లారిస్ (బాలముతియా మాండ్రిల్లారిస్ అనేది మట్టిలో నివసించే అమీబా) చేరినట్లు తేలింది. ఇది మెదడు లోపలికి ప్రవేశించి రోగి చనిపోయేంత వరకు వ్యాపించింది. ఈ జీవిని మెదడు తినే అమీబా అని కూడా అంటారు.

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. రిపోర్ట్స్ చూసి వైద్యులు షాక్
Brain Eating Amoeba
Follow us

|

Updated on: Apr 18, 2024 | 7:33 PM

ఈ ప్రపంచంలో వివిధ రకాల జంతువులు, కీటకాలు కనిపిస్తాయి. మానవ శరీరంలో కూడా కీటకాలు ఉంటాయని మీకు తెలుసా? అవును ఆ కీటకాలలో కొన్ని శరీరానికి ప్రయోజనం కలిగిస్తే అయితే కొన్ని కీటకాలు మానవ శరీరాన్ని తిని మరణానికి కారణం అవుతాయి. ఇలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. ఒక మహిళ తలలోకి పురుగు ప్రవేశించింది. అది ఆమె మెదడును తినడం ప్రారంభించింది. అయితే డాక్టర్లు ఆ మహిళ మెదడును పురుగు తినేస్తోందని ఊహించలేదు.. అసలు విషయం తెలిసిన తర్వాత వైద్యులు సహా  షాక్ అయ్యారు.

ఆ మహిళ వయస్సు 77 సంవత్సరాలు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం చాలా రోజులుగా ఓ మహిళ తల తిరగడం, చికాకుగా ఉండడం, మాట్లాడటం కష్టంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలో వచ్చిన రిపోర్ట్స్ చూసి ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని భావించారు. అయితే మరింత వివరాల కోసం వైద్యులు అదనపు పరీక్షలను చేయడానికి వెన్నెముకలోకి సూదిని చొప్పించినప్పుడు.. ఆమె మెదడులో బాలముతియా మాండ్రిల్లారిస్ (బాలముతియా మాండ్రిల్లారిస్ అనేది మట్టిలో నివసించే అమీబా) చేరినట్లు తేలింది. ఇది మెదడు లోపలికి ప్రవేశించి రోగి చనిపోయేంత వరకు వ్యాపించింది. ఈ జీవిని మెదడు తినే అమీబా అని కూడా అంటారు.

ఎలా ఈ వ్యాధి సోకుతుందంటే

బాలముతియా మాండ్రిల్లారిస్ సాధారణంగా దుమ్ము, నేల, నీటిలో కనిపిస్తుంది. ఇది శరీరం మీద గాయాలు అయినప్పుడు లేదా గాలిని పీల్చినప్పుడు మానవులకు సోకుతుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ఈ చైనీస్ మహిళను పరీక్షించిన వైద్య బృందం ఆమె ఒక గ్రామంలో చెరువు సమీపంలో నివసించేదని.. ఆమెకు అక్కడే మెదడు తినే అమీబా చేరినట్లు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైద్యులు మహిళను రక్షించలేకపోయారు

వైద్యుల ప్రకారం మహిళ ఆసుపత్రిలో సుమారు 8 రోజులు గడిపింది. అక్కడ ఆమె క్రమంగా శారీరక ఇబ్బందికి గురైంది. మాట్లాడటం కష్టంగా మారింది. అంతే కాదు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ సమయంలో వైద్యులు ఆమెను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించారు.  అయితే ఆమె పరిస్థితి విషమించి తరువాత ఆమె మరణించింది.

మెదడును తినే కీటకం ఎప్పుడు కనుగొనబడింది?

నివేదికల ప్రకారం బాలముతియా మాండ్రిల్లారిస్ మొదటిసారిగా 1986 సంవత్సరంలో కనుగొనబడింది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 200 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిల్లో 100 అమెరికాలో మాత్రమే ఉన్నాయి. CDC అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా ప్రకారం 90 శాతం మంది రోగులు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా మరణిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..