AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్స్, లక్షణాలు, తినాల్సిన ఆహారం, నివారణ పద్ధతులు మీ కోసం

మూత్రాశయ నాళికలో ఇన్ఫెక్షన్, మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రం రంగు మారడం, దుర్వాసన, తరచుగా మూత్రం రావడం లేదా మూత్రం తగ్గడం, స్త్రీలలో కటిలో నొప్పి (కడుపు దిగువ భాగం), అదే  పురుషులలో అయితే పురీషనాళంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో బ్యాక్టీరియా UTI సంక్రమణకు కారణం వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎక్కువసేపు మూత్ర విసర్జన చేయకపోవడం, బహిష్టు సమయంలో ట్యాంపాన్‌లు లేదా శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగించడంలో అజాగ్రత్తగా ఉండటం మొదలైనవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి.

యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్స్, లక్షణాలు, తినాల్సిన ఆహారం, నివారణ పద్ధతులు మీ కోసం
Urinary Tract Infection
Surya Kala
|

Updated on: Apr 18, 2024 | 6:23 PM

Share

యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా సాధారణమైన సమస్య.. అయితే యూటీఐ సమస్య అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అనారోగ్య సమస్య వెనుక స్పష్టమైన కారణం తెలియదు. UTI సమస్య ఇన్ఫెక్షన్ మూత్రాశయ ట్యూబ్‌లో వ్యాపిస్తుంది. హెర్పెస్ వైరస్ లేదా కొన్ని శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, ఈస్ట్ వలన ఇన్ఫెక్షన్ మూత్ర నాళానికి సోకుతుంది. దీని లక్షణాలను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే, ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీ, గర్భాశయం మొదలైన శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. పరిస్థితి తీవ్రమవుతుంది.

UTI ఇన్ఫెక్షన్ ఏ వయసులోనైనా సంభవించవచ్చు. అయితే ఈ సమస్య పిల్లలలో కంటే పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ 7 నుంచి 15 రోజులలో నయం అయినప్పటికీ.. ఈ సమస్య పదే పదే కొనసాగితే ఈ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం అవసరం.

UTI సంక్రమణ లక్షణాలు ఏమిటి?

మూత్రాశయ నాళికలో ఇన్ఫెక్షన్, మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రం రంగు మారడం, దుర్వాసన, తరచుగా మూత్రం రావడం లేదా మూత్రం తగ్గడం, స్త్రీలలో కటిలో నొప్పి (కడుపు దిగువ భాగం), అదే  పురుషులలో అయితే పురీషనాళంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ పెరిగితే మూత్రాశయ సమస్యలతో పాటుగా వెన్నునొప్పి, జ్వరం, వాంతులు, వికారం వంటి  ఇతర లక్షణాలు కూడా  ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

యూరినరీ ఇన్ఫెక్షన్ తరచుగా రావడానికి కారణం?

చాలా మందిలో బ్యాక్టీరియా UTI సంక్రమణకు కారణం వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎక్కువసేపు మూత్ర విసర్జన చేయకపోవడం, బహిష్టు సమయంలో ట్యాంపాన్‌లు లేదా శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగించడంలో అజాగ్రత్తగా ఉండటం మొదలైనవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి.

అంతేకాదు మధుమేహం, గర్భధారణ సమయంలో, యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం, కిడ్నీ రాళ్ల సమస్య, శరీరంలో నీటి కొరత, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో UTI వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వాస్తవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం.

నివారణ పద్ధతులు ఏమిటి?

యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్యను నివారించడానికి, వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చెమటను పీల్చుకోగల బట్టతో చేసిన దుస్తులను ధరించండి. అదే సమయంలో నడుము క్రింద చాలా బిగుతైన దుస్తులు ధరించవద్దు. ముఖ్యంగా బహిష్టు సమయంలో మహిళలు పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి. అంతే కాకుండా వీలైనంత ఎక్కువ నీరు తాగడంతోపాటు మూత్ర విసర్జన చేసేటప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. దీని తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తే, ఖచ్చితంగా డాక్టర్ వద్దకు వెళ్లసిందే..

ఏమి తినాలి, ఏ వస్తువులకు దూరంగా ఉండాలి?

UTI సంక్రమణ విషయంలో లేదా దానిని నివారించడానికి, మసాలా, వేయించిన, యాసిడ్ ఉత్పత్తి చేసే ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా ముఖ్యం. అంతేకాదు టీ లేదా కాఫీ వంటి కెఫిన్ ఉన్న వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది.

ప్రోబయోటిక్ ఆహారాలు UTI సంక్రమణను నివారించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పుల్లటి పెరుగు, మజ్జిగ వంటి వాటిని క్రమం తప్పకుండా తినే ఆహారంలో చేర్చుకోండి. ఇది కాకుండా ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, వివిధ రకాల ధాన్యాలు, బీన్స్ మొదలైన వాటిని తినండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..