AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాఫిక్ రద్దీకి చెక్.. త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌లు!

భారత రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు, భవిష్యత్తు రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తూ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2047లో తొలిసారిగా ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌ల వినియోగానికి అధికారికంగా చోటు కల్పించారు.

ట్రాఫిక్ రద్దీకి చెక్.. త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌లు!
Delhi Air Taxis
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2026 | 5:48 PM

Share

భారత రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు, భవిష్యత్తు రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తూ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2047లో తొలిసారిగా ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌ల వినియోగానికి అధికారికంగా చోటు కల్పించారు.

భారత రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ అవరోధాలను తగ్గించి, రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2047ను సిద్ధం చేసింది. ఈ దీర్ఘకాలిక ప్రణాళికలో తొలిసారిగా ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌ల వంటి అత్యాధునిక రవాణా మార్గాలకు అధికారికంగా ప్రాధాన్యతనిచ్చారు. నగర పరిధిలో రవాణాను వేగవంతం చేసేందుకు పట్టణ విమానయాన రవాణా, విధానాన్ని ఈ ప్లాన్‌లో చేర్చారు. అయితే, ప్రస్తుతానికి ఎయిర్ టాక్సీల ప్రారంభ తేదీలు, నిర్దిష్ట మార్గాలు లేదా సర్వీసు ఆపరేటర్లను ఖరారు చేయలేదు. విమానయాన నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాతే ఇవి అందుబాటులోకి రానున్నాయి. అయినప్పటికీ, భవిష్యత్తు రవాణా ప్లానింగ్‌లో ఎయిర్ టాక్సీలకు స్థానం కల్పించడం ఒక మైలురాయిగా భావించవచ్చు.

నోయిడాలోని జెవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీని పెంచేందుకు ఈ మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ద్వారక వైపు ఉన్న UER-2 నెట్‌వర్క్‌ను పొడిగించి నోయిడా, గ్రేటర్ నోయిడా, జెవర్ ప్రాంతాలను కలుపుతూ స్ట్రాటజిక్ లింక్ 2 పేరుతో నూతన కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్, జెవర్ ఎయిర్‌పోర్ట్ మధ్య ప్రయాణికులు, సరుకు రవాణా కోసం మల్టీ-లెవెల్ రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రవాణాతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు ఆసుపత్రులు, ఎత్తైన భవనాల పైకప్పులపై నిబంధనల ప్రకారం హెలిప్యాడ్‌ల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. వీటిని ఎయిర్ అంబులెన్స్, విపత్తు సహాయక చర్యల కోసం ఉపయోగించనున్నారు. అంతేకాకుండా గురుగ్రామ్, ఝజ్జర్, లోని-బాగ్పత్ ప్రాంతాల వైపు కూడా రవాణా కారిడార్లను మరింత బలోపేతం చేయాలని మాస్టర్ ప్లాన్ 2047 లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us