AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎటు పోతుంది సమాజం.. రాఖీ కట్టిన ‘అన్న’నే పెళ్లాడింది.. యువతి తండ్రి షాకింగ్ నిర్ణయం..!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ యువతి వివాహం కుటుంబంలో తీవ్ర వివాదానికి దారితీసింది. దాదాపు 15 ఏళ్లుగా సోదరుడిగా భావించి రాఖీ కట్టిన వ్యక్తినే ఆమె వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు యువతి తండ్రి ఆమెకు ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

ఎటు పోతుంది సమాజం.. రాఖీ కట్టిన ‘అన్న’నే పెళ్లాడింది.. యువతి తండ్రి షాకింగ్ నిర్ణయం..!
Prayagraj Marriage Controversy
Balaraju Goud
|

Updated on: Oct 01, 2026 | 12:25 PM

Share

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ యువతి వివాహం కుటుంబంలో తీవ్ర వివాదానికి దారితీసింది. దాదాపు 15 ఏళ్లుగా సోదరుడిగా భావించి రాఖీ కట్టిన వ్యక్తినే ఆమె వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు యువతి తండ్రి ఆమెకు ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

నందాని పాండే అనే 20 ఏళ్ల యువతి.. తమ గ్రామానికి చెందిన 22 ఏళ్ల శశ్వత్ గుప్తాను సెప్టెంబర్ 20న వివాహం చేసుకుంది. అంతకుముందు ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శశ్వత్ తమ ఇంటికి చాలా ఏళ్లుగా వచ్చేవాడని, నందాని అతడిని సోదరుడిగా భావించేదని ఆమె తల్లి చెప్పింది. దాదాపు 15 ఏళ్ల పాటు అతడికి రాఖీ కట్టినట్లు పేర్కొంది.

అయితే నందాని మాత్రం కుటుంబ సభ్యుల వాదనకు భిన్నంగా స్పందించింది. తాము చాలాకాలంగా ప్రేమించుకున్నామని, పరస్పర అంగీకారంతోనే వివాహం చేసుకున్నామని వీడియో ద్వారా తెలిపింది. తాను భర్తతో సంతోషంగా ఉన్నానని, తమను ఎవరూ వేధించవద్దని కోరింది. తండ్రి తనను శారీరకంగా, మానసికంగా వేధించారని, అనారోగ్యంతో ఉన్న సమయంలో సరైన వైద్యం అందలేదని ఆమె ఆరోపించింది. పెళ్లి తర్వాత భర్త, అత్తమామలు తనను చూసుకుంటూ చికిత్స చేయిస్తున్నారని పేర్కొంది. ఇంటి నుంచి రూ.2 లక్షలు తీసుకెళ్లిందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలను ఆమె ఖండించింది.

సెప్టెంబర్ 21న పెళ్లి విషయం కుటుంబానికి తెలియడంతో నందాని తండ్రి ఆమెకు ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఆమెతో సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపారు. మరోవైపు, శశ్వత్ తనను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడన్న కుటుంబ ఆరోపణలను నందాని ఖండించింది. తాను స్వచ్ఛందంగానే వెళ్లి వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలు భిన్నంగా ఉన్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us