AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకట్రెండు కాదు.. వన్డే హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా.. తొలి టీంగా చరిత్ర సృష్టించిన భారత్..!

Team India Records: గువాహటిలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ చరిత్ర సృష్టించింది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో ఛేదించిన టీమిండియా.. వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేజ్ నమోదు చేసింది. అదే మ్యాచ్‌లో జట్టు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకోగా, శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు.

ఒకట్రెండు కాదు.. వన్డే హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా.. తొలి టీంగా చరిత్ర సృష్టించిన భారత్..!
Team India Records
Venkata Chari
|

Updated on: Oct 01, 2026 | 3:28 PM

Share

Team India Records: వెస్టిండీస్ (West Indies)పై రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు (Team India) పరుగుల వరద పారించింది. గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 406 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో వన్డే క్రికెట్‌లో తన అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది. మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) భారీ డబుల్ సెంచరీతో భారత ఇన్నింగ్స్‌కు ప్రధాన బలంగా నిలిచాడు. 117 బంతుల్లో డబుల్ సెంచరీ (223) పూర్తి చేసిన గిల్, వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు, భారత్ 300 పరుగుల మార్క్‌ను 175 బంతుల్లోనే దాటింది. ఒక వన్డేలో 30 ఓవర్లలోపే 300 పరుగులు చేసిన తొలి జట్టుగా టీమిండియా కొత్త రికార్డు నమోదు చేసింది.

ఈ రికార్డుకు ముందు దక్షిణాఫ్రికా (South Africa) పేరిట ఉంది. 2006లో జొహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 194 బంతుల్లో 300 పరుగులు సాధించింది. ఇప్పుడు భారత్ 175 బంతుల్లో ఆ మార్క్‌ను అందుకుని ఆ రికార్డును అధిగమించింది.

గిల్ డబుల్ సెంచరీ మరో ప్రత్యేకతను సంతరించుకుంది. 117 బంతుల్లో డబుల్ టన్ పూర్తి చేసిన అతడు ఇషాన్ కిషన్ (Ishan Kishan) పేరిట ఉన్న 126 బంతుల రికార్డును అధిగమించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.

ఇక రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఈ భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో తనదైన మైలురాయిని అందుకున్నాడు. 75 బంతుల్లో 101 పరుగులు చేసిన రోహిత్ వన్డేల్లో 35వ శతకాన్ని నమోదు చేశాడు. అదే సమయంలో 12,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడో బ్యాటర్‌గా, భారత్ తరపున సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లీ (Virat Kohli) తరువాత మూడో ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కూడా తన అత్యధిక వన్డే స్కోరును నమోదు చేసింది. 405/7తో ఇన్నింగ్స్ ముగించిన కరీబియన్ జట్టు, 2019లో ఇంగ్లండ్‌పై చేసిన 389 ఆలౌట్ స్కోరును అధిగమించింది.

మొత్తంగా మ్యాచ్‌లో 811 పరుగులు నమోదయ్యాయి. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌ల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో వెస్టిండీస్‌పై భారత్ వరుసగా 14వ వన్డే సిరీస్ విజయాన్ని కూడా ఖరారు చేసుకుంది. 2-0 ఆధిక్యంతో సిరీస్ భారత్ సొంతమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us