AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Video: ఇదేం పామురా సామి.. భూచక్రం మాదిరి గింగిరాలు తిరుగుతుంది…?

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తాచుపాములు, కట్లపాములు, జెర్రిపోతులు, రక్తపింజర్లు, కొండచిలువలు తారసపడుతూ ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గిరినాగులు అదేనండి కింగ్ కోబ్రాలు కూడా కనిపిస్తాయి. కానీ మీరు ఈ వీడియోలో ఉన్న పామును ఎప్పుడైనా చూశారా..? తాని ప్రవర్తన ఎంత చిత్రంగా ఉందో తెల్సా..?

Snake Video: ఇదేం పామురా సామి.. భూచక్రం మాదిరి గింగిరాలు తిరుగుతుంది...?
Snake
Ram Naramaneni
|

Updated on: Sep 29, 2025 | 3:03 PM

Share

సోషల్ మీడియా ఇప్పుడు ఎంత స్పీడ్ అయిందో కదా..! ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. క్షణాల్లో ఆ వార్తలు, వీడియోలు వైరల్ అవుతాయి. అందులో ఎక్కవగా జంవతులు, పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. కాగా పాము కనబడితే చాలామంది భయంతో వణికిపోతారు. అంతెందుకు పాము వీడియో కనిపించినా వెంటనే పైకి స్క్రోల్ చేస్తారు. తాజాగా ఓ వింతపాము వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో పాము భూచక్రం మాదిరి.. గుండ్రంగా తిరుగుతూ కనిపించింది. ఆ తిరుగుతూ ఒక్కసారిగా బలాన్ని పుంజుకుని పైకి వచ్చి కాటేసుందుకు అది ప్రయత్నించింది. దాని ప్రవర్తన చాలా భయానకంగా ఉంది. కొందరు దీన్ని రాటిల్ స్నేక్ అంటున్నారు. మరికొందరు దాని తోకపై అలాంటి నిర్మాణం లేదని.. రాటిల్ స్నేక్ కాదంటున్నారు. ఈ పాము గోధుమరంగులో ఉండటాన్ని వీడియోలో మీరు గమనించవచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @AMAZlNGNATURE అనే ఖాతా నుంచి షేర్ చేశారు. సెప్టెంబర్ 19న షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలామంది లైక్ చేయగా.. కొందరు కామెంట్స్ చేశారు. ఇలాంటి పామును మీరు చూశారా..? దాన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి .

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..