Viral Video: వామ్మో.. ఎంత పెద్ద పామో..! ఇలాంటి పైథాన్‌ను జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో..

తాజాగా ఓ భయంకర పైథాన్ వీడియో వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి భారీ కొండ చిలువను ఇప్పటివరకు చూడలేదని.. ఇది చూస్తుంటే.. ఒళ్లు జలధరిస్తుందని పేర్కొంటున్నారు.

Viral Video: వామ్మో.. ఎంత పెద్ద పామో..! ఇలాంటి పైథాన్‌ను జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో..
Python Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 12, 2022 | 5:33 PM

Python Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యకరంగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా ఓ భయంకర పైథాన్ వీడియో వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి భారీ కొండ చిలువను ఇప్పటివరకు చూడలేదని.. ఇది చూస్తుంటే.. ఒళ్లు జలధరిస్తుందని పేర్కొంటున్నారు. ఈ భారీ ఫైథాన్‌కు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) సుశాంత నంద షేర్ చేశారు. బయటి గోడ నుంచి ఇంట్లోకి వెళుతున్న కొండచిలువ క్లోజ్-అప్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తాను చాలా ఫోటోలు, వీడియోలు చూశాను.. కానీ ఇది నాకు షాక్ ఇచ్చిన సన్నివేశం అంటూ IFS అధికారి పేర్కొన్నారు.

ఈ వైరల్ వీడియోలో కొండచిలువ ఇంటి ముందు తలుపు వద్దకు పాకుతున్నట్లు కనిపిస్తుంది. అక్కడ మోటార్ సైకిల్, సైకిల్ పార్క్ చేసి ఉన్నాయి. ప్రధాన ద్వారం వెలుపల నీటి బాటిల్ కూడా ఉంది. ఈ వీడియో షేర్ చేసిన నాటినుంచి ఇప్పటివరకు 55,000 వీక్షణలు రాగా.. 1,900 పైగా లైక్‌లు వచ్చాయి.వీడియోలో పోస్ట్ చేసిన కొండచిలువ పరిమాణం, ఎక్కడ ఉందనేది నిర్ధారించలేదు. కానీ ట్విట్టర్ వినియోగదారులు భారీ అనకొండను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమా..? కాదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కొండచిలువ కాదు, బహుశా అనకొండ కావచ్చు అంటూ పేర్కొంటున్నారు. మరి కొంతమంది యూజర్లు దీనిని రెటిక్యులేట్ పైథాన్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

కాగా.. అచ్చం ఇలాంటి ఫైథాన్‌ను.. గత నెలలో ఫ్లోరిడాలో బంధించారు. ఇప్పటివరకు బంధించిన అతిపెద్ద బర్మీస్ పైథాన్‌గా దీనిని పరిశోధకుల బృందం పేర్కొంది. కొండచిలువ చనిపోయే ముందు జింకను వేటాడినట్లు పరిశోధకులు తెలిపారు. 215 పౌండ్ల (98 కిలోగ్రాములు) బరువు, 18 అడుగుల (5 మీటర్లు) కంటే ఎక్కువగా ఆడ బర్మీస్ కొండచిలువ ఉన్నట్లు తెలిపారు. దానిని స్వాధీనం చేసుకున్నప్పుడు దాని కడుపులో 122 గుడ్లు అభివృద్ధి చెందుతున్నాయని సౌత్‌వెస్ట్ ఫ్లోరిడా కన్జర్వెన్సీ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..