AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithyananda: నిత్యానందకు 18 అడుగుల విగ్రహం.. భగ్గుమన్న సుబ్రహ్మణ్య స్వామి భక్తులు.. అసలేమైందంటే..?

26 అడుగుల సుబ్రమణ్య స్వామి విగ్రహం కూడా నిత్యానంద పోలికలతో ఏర్పాటు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యానంద, సుబ్రమణ్య స్వామిల రూపం ఉన్న విగ్రహాలు తొలగించాలని స్థానిక గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Nithyananda: నిత్యానందకు 18 అడుగుల విగ్రహం.. భగ్గుమన్న సుబ్రహ్మణ్య స్వామి భక్తులు.. అసలేమైందంటే..?
Nithyananda
Shaik Madar Saheb
|

Updated on: Jul 12, 2022 | 4:22 PM

Share

Nithyananda Paramahamsa, నిత్య వివాదాల స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా వనూర్‌లో నిత్యానంద ఆలయంపై వివాదం నెలకొంది. స్వామి నిత్యానందకి బాలసుబ్రమణ్యం అనే భక్తుడు ఇచ్చిన కానుకపై రచ్చ జరుగుతోంది. 18 అడుగుల ఎత్తులో స్వామి నిత్యానందకు విగ్రహం ఏర్పాటు చేశారు. పరమశివుడి రూపంలో ఉన్న నిత్యానంద నిలువెత్తు విగ్రహానికి సోమవారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. వసూర్‌ ఆలయంలో కుంభాభిషేకంతో భక్తుల దర్శనాలు ప్రారంభవుతున్నాయి. అయితే.. అక్కడే నిర్మించిన 26 అడుగుల సుబ్రమణ్య స్వామి విగ్రహం కూడా నిత్యానంద పోలికలతో ఏర్పాటు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యానంద, సుబ్రమణ్య స్వామిల రూపం ఉన్న విగ్రహాలు తొలగించాలని స్థానిక గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వానూరులోని పెరంబాయి గ్రామం పక్కనే ఉన్న ఐశ్వర్యనగర్‌లో మలేషియా మురుగన్ దేవాలయం మాదిరిగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. 27 అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహం పూర్తయింది.. దానికి బతుమలై మురుగన్ టెంపుల్ అని పేరు పెట్టారు. దీనికి సోమవారం కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తులో నిత్యానంద విగ్రహాన్ని రూపొందించి బటుమలై మురుగన్, నిత్యానంద విగ్రహాలకు కుంభాభిషేకం నిర్వహించడం ప్రస్తుతం కలకలం రేపింది.

ఈ విగ్రహాన్ని చూసి పోలీసు అధికారులు, ప్రజలు, భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విగ్రహం శివుని వేషధారణలో చేతిలో శూలంతో ఉన్న నిత్యానంద రూపాన్ని పోలి ఉంది. గుడిలో కుంభాభిషేకం చేసిన శివాచార్యులను దీని గురించి ప్రశ్నించగా, అది శివుని మరో అవతారమైన కాలభైరవుడని.. స్థపతి విగ్రహం సక్రమంగా డిజైన్ చేయలేదని పేర్కొన్నారు.

అనంతరం ఆలయ నిర్వాహకుడు బాలసుబ్రమణ్యం గదిలో నిత్యానంద ఆశీర్వదిస్తున్న పలు ఛాయాచిత్రాలు, గదినిండా నిత్యానంద ఫోటోలను ఉంచడం కలకలం రేపింది. నిత్యానంద శిష్యుడు మురుగన్ ఆలయాన్ని నిర్మించి అక్కడ 18 అడుగుల నిత్యానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తగదని.. వెంటనే దాన్ని తీసివేయాలంటూ పలువురు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి