AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ చింపాంజీది ఎంత పెద్ద మనస్సో భయ్యా..! వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..

నెట్టింట వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలు తెలివైనవి. రెండూ కూడా ఒకేలా ఉంటాయి. వాస్తవానికి అవి రెండు వేర్వేరు.

Viral Video: ఈ చింపాంజీది ఎంత పెద్ద మనస్సో భయ్యా..! వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..
Chimpanzee Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2022 | 6:08 AM

Share

Chimpanzee – Fish Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. నెట్టింట వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలు తెలివైనవి. రెండూ కూడా ఒకేలా ఉంటాయి. వాస్తవానికి అవి రెండు వేర్వేరు. వీటిలో చింపాంజీల వ్యవహారశైలి అచ్చం మనషుల్లానే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో దీన్ని నిరూపితం చేస్తోంది. దీనిలో చింపాంజీ దానకర్ణుడిలా మారింది.. అదేంటి అని సందేహం వ్యక్తం అవుతోందా..? అవునండి.. చింపాంజీ చేపలకు ఆహారం వేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసి (Social Media) నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దానంలో దీనిని మించింది ఏది లేదంటూ అభినందిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో చింపాంజీ ప్రశాంతంగా చెక్క వంతెనపై కూర్చుని ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఇది కొలనులోని చేపలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో గిన్నెలోని ఆహారాన్ని తీసి.. చేపలకు వేస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే.. చింపాంజీ చేసిన పని.. అచ్చం మనిషి మాదిరిగానే కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఆహారం పంచుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుందన్న సందేశం ఈ వీడియోలో దాగి ఉందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వీడియోను @buitengebieden అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. దీనిని 14 లక్షల మందికి పైగా చూశారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..