Viral Video: కోడిపుంజు కంత్రీప్లాన్.. కొండపై నుంచి కోతిని తోసేందుకు కుట్ర..! ప్లాన్ రివర్స్.. చూస్తే పొట్ట చెక్కలే..
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వింత వార్త, వీడియో వైరల్ అవుతోంది. అందులో చాలా వరకు ఫన్నీ విషయాలే కనిపిస్తుంటాయి. అలాంటి కొన్ని వీడియోలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. మరికొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. అలాంటి వీడియో ఒక వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కోడి, కోతికి మధ్య జరిగిన సంఘటన ఇది. కోడి చాకచక్యాన్ని గ్రహించిన కోతి ఏమి చేసిందో చూస్తే మీరూ చూసేయండి..

సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. పాములు, అడవి జంతువులు, ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాలు, నెమళ్లు ఇలా చాలా వాటికి సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటాయి. అడవి జంతువుల జీవనం, వాటి వేట తెలుసుకునేందుకు ప్రజలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. అందులో కోతులకు సంబంధించిన వీడియోలు కూడా మనం అనేకం చూస్తుంటాం. తరచూ కోతులు చేసే పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కోతికి కోడిపుంజు ఒకటి చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను ‘animalsinthenaturetoday’ అనే పేజీ ద్వారా Instagramలో షేర్ చేశారు. ఇందులో ఒక ఎత్తైన కొండపై ఒక పెద్ద దేవుడి విగ్రహం ఉంది. దానికి దగ్గరగా ఒక కోతి కూర్చుని ఉంది. అంతలోనే ఆ కోతి వద్దకు ఒక కోడిపుంజు వచ్చింది…అది రావటం రావటంతోనే ఆ కోతి మీదకు యుద్ధం ప్రకటించింది. ఎత్తైన కొండపై రాతి అంచున ప్రశాంతంగా కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న కోతిపై ఆ కోడిపుంజు ఒక్కసారిగా దాడికి దిగింది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
అకస్మాత్తుగా, వచ్చిన కోడి తన ముక్కుతో కోతిపై పదే పదే దాడి చేయడం ప్రారంభిస్తుంది. వీడియో చూస్తుంటే.. ఆ కోడిపుంజపు కోతిని బండపై నుండి కిందకు తోసేందుకు ప్రయత్నిస్తుందా..? అన్నట్టుగా ఉంది. కానీ, ఆ కోతి తెలివిగా వ్యవహరిస్తూ కోపంతో కోడిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. అంతేగానీ, ఆవేశంలో అక్కడ ఎగరటం, దూకటం వంటివి చేయదు. అలా ఆ కోడిపుంజు, కోతికి మధ్య ఈ పోరాటం కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇంటర్‌నెట్ వేదికగా నెటిజన్లను ఎంతగానో అలరించింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ కామెంట్స్‌తో స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




