AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Egg Food: పాము గుడ్లతో చేసిన ఫుడ్ వారికి పసందైన విందు.. ఏ దేశాలవారు తింటారంటే

నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపలు, గుడ్లు వంటి ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ప్రపంచంలో వింత ఆహార అలవాట్లు ఉన్న ప్రజల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. ఈ నేపధ్యంలో కోడి గుడ్లు, బాతు గుడ్లు లా పాము గుడ్లని కూడా తినేవారు ఉంటారా అని ఆలోచిస్తే.. అవును.. కొన్ని దేశాలకు చెందిన ప్రజలు పాము గుడ్లతో చేసిన ఆహరాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పాము గుడ్లు తినే ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఎలా సురక్షితంగా తింటారో తెలుసుకుందాం..

Snake Egg Food: పాము గుడ్లతో చేసిన ఫుడ్ వారికి పసందైన విందు.. ఏ దేశాలవారు తింటారంటే
Snake Eggs Food
Surya Kala
|

Updated on: Sep 22, 2025 | 10:15 AM

Share

ఉడుములు, గద్దలు మరియు ఇతర పాములు వంటి అనేక జంతువులు పాము గుడ్లను తింటాయని అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది ప్రజలు కూడా పాము గుడ్లతో చేసిన ఆహారాన్ని తింటారు. వాస్తవానికి ఫలదీకరణం చెందని పాము గుడ్లను తినవచ్చు. ఇవి ప్రోటీన్-రిచ్, పోషకమైన ద్రవాన్ని కలిగి ఉంటాయి. అయితే పక్షి గుడ్ల విషయంలో మాదిరిగానే.. పాము గుడ్లలో అనారోగ్యానికి గురిచేసే వ్యాధికారకాలు లేదా ప్రతిచర్యను ప్రేరేపించే అలెర్జీ కారకాలు కూడా ఉండవచ్చు. కనుక పాము గుడ్లను తినే ముందు తప్పని సరిగా ఉడికించాలి.

ఏ దేశస్తులు తింటారంటే

కొన్ని సంస్కృతులలో పాము గుడ్డు వంటకాలు ప్రసిద్ధి చెందాయి. సాంప్రదాయ వియత్నామీస్ వంటకాల్లో పాము శరీరం లోపల నుంచి తీసిన పాము గుడ్లను ఉపయోగిస్తారు. ఎక్కువగా పాము గుడ్లతో చేసిన పదార్ధాలు ఫేమస్ అల్పాహారం. అంతేకాదు అన్నం, నూడుల్స్‌తో కలిపి వడ్డిస్తారు. పాము గుడ్లను పక్షి గుడ్డు మాదిరిగానే ఉడకబెట్టుకుని, వేయించుకుని ఇతర రకాల ఆహారపదార్థాలు చేసుకుని తింటారు. థాయిలాండ్, ఇండోనేషియా, చైనా, జపాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పాము గుడ్ల చేసిన ఆహారాన్ని తింటారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

పాము గుడ్లు విషపూరితమా?

పాము గుడ్లు విషపూరితమైనవి కావు… అయితే అనారోగ్యాన్ని కలిగిస్తాయి. పూర్తిగా ఉడికించకుండా తింటే హానికరమైన వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరవచ్చు. విష పూరిత పాముల్లో కూడా విషం ఉండదు. ఎందుకంటే పాము కోరల్లోనే విషం ఉత్పత్తి అవుతుంది. కనుక వీరు ఫలదీకరణం చెందని గుడ్డును మాత్రమే తింటారు.

ఇవి కూడా చదవండి

USలో పాము గుడ్లు తింటారా?

ఫ్లోరిడాకు చెందిన ఒక కొండచిలువ వేటగాడు తన ప్రాంతంలో విస్తారంగా ఉన్న బర్మీస్ కొండచిలువల గుడ్లను తింటున్నాడు. కొండచిలువ గుడ్లను సరిగ్గా ఉడికించినట్లయితే తినడం పూర్తిగా సురక్షితమని చెబుతున్నాడు. పైథాన్ గుడ్లతో షుగర్ కుకీల తయారీతో పాటు.. వేడి సాస్‌తో కూడా తింటున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..