Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిందితుడికి బెయిల్ ఇవ్వాలా వద్దా..చాట్ జీపీటీ సలహా అడిగిన న్యాయమూర్తులు

ఇప్పటివరకు గూగూలే అన్నింటికి ఆధారం అనుకున్న ఇంటర్నేట్ వినియోగదారులకు చాట్ జీపీటీ వచ్చాక మరో ప్రత్యమ్నాయ మార్గం కనబడింది. ప్రస్తుతం రోజురోజుకి చాట్ జీపీటీకి ఉన్న జనాధారణ పెరుగుతోంది.

నిందితుడికి బెయిల్ ఇవ్వాలా వద్దా..చాట్ జీపీటీ సలహా అడిగిన న్యాయమూర్తులు
Chatgpt
Follow us
Aravind B

|

Updated on: Mar 29, 2023 | 2:10 PM

ఇప్పటివరకు గూగూలే అన్నింటికి ఆధారం అనుకున్న ఇంటర్నేట్ వినియోగదారులకు చాట్ జీపీటీ వచ్చాక మరో ప్రత్యమ్నాయ మార్గం కనబడింది. ప్రస్తుతం రోజురోజుకి చాట్ జీపీటీకి ఉన్న జనాధారణ పెరుగుతోంది. అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది చాట్ జీపీటీ. మొన్న ఓ కుక్కకు ఉన్న వ్యాధిని గుర్తించి తన ప్రాణాలు కాపాడింది. అలాగే ఇప్పుడు న్యాయమూర్తులకు కూడా ఓ సలహా ఇచ్చింది. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి నిందితుడికి బెయిల్ మంజూరు చేసే విషయంలో పంజాబ్ హర్యాణా హైకోర్టు జడ్జీలు చాట్ జీపీటీని సలహా అడిగారు. దుండగులు క్రూరత్వంతో ఎవరినైనా దాడి చేస్తే్ అతని బెయిల్ అభ్యర్థనపై మీరిచ్చే సలహా ఏంటని అడిగారు.

దీనికి చాట్ జీపీటీ స్పందిస్తూ క్రురత్వం వల్లే మనిషి ఇతరులను చంపుతున్నారు కాబట్టి బెయిల్ పిటీషన్ ను తిరస్కరిస్తానని సమాధానమిచ్చింది. దాడి తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేసే విధివిధానాలు కూడా మారుతుంటాయని తెలిపింది. నేర తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అని ఆధారపడి ఉంటుందని పేర్కొంది. నిర్దోషినని నిరూపించేందుకు సరైన సాక్ష్యాలంటేనే బెయిల్ కు అర్హుడని లేకపోతే కాదని వెల్లడించింది. నిందితుడి సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకోని న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేయవచ్చని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు చాట్ జీపీటీకి న్యాయశాస్త్రంపై ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేశామని న్యాయమూర్తులు తెలిపారు. చాట్ జీపీటీ ఇచ్చే్ సమాచారం, సూచనలు పరిగణలోకి తీసుకోని తీర్పులు ఇవ్వకూడదని జస్టీస్ అనుప్ చిట్కారా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే పంజాబ్ కు చెందిన నిందితుడిపై 2020 జూన్ లో హత్య ఇతర నేరాలకు సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు బెయిల్ కు అర్హుడని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే నిందితుడి గతాన్ని బట్టి అతను బెయిల్ పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందంటూ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..