Optical illusion: పుట్టగొడుల మాటున ఓ ఎలుక నక్కి నక్కి చూస్తోంది.. 20 సెకండ్లలో గుర్తిస్తే మీకంటే తోపెవరూ లేరు..
Optical illusion: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూ ఉంటుంది. వీటిలో సమాచారాన్ని అందించేవి కొన్ని అయితే మనలోని నైపుణ్యాలను పెంచేవి మరికొన్ని...
Optical illusion: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూ ఉంటుంది. వీటిలో సమాచారాన్ని అందించేవి కొన్ని అయితే మనలోని నైపుణ్యాలను పెంచేవి మరికొన్ని. ఇక కాలక్షేపం కోసం కూడా సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు నెటిజన్లు. అందుకు అనుగుణంగానే కొంత మంది క్రియేటర్లు రకరకాల ఫొటోలను క్రియేట్ చేస్తూ నెటిజన్లకు సవాలు విసురుతున్నారు. ఇలా వైరల్ అవుతోన్న వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ఒకటి.
కాలక్షేపంతో పాటు, నైపుణ్యాలను పెంచే ఇలాంటి ఫొటోలకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్. ముఖ్యంగా ఫొటోల్లో దాగున్న వాటిని గుర్తుపట్టండి అంటూ పోస్ట్‌లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫొటోలో భారీ సంఖ్యలో పుట్ట గొడుగులు ఉన్నాయి కదా. అయితే అందులో ఒక చిట్టెలుక ఉంది. పుట్టగొడుగును పట్టుకొని నక్కి నక్కి చూస్తోంది కనిపించిందా.?
ఈ ఫొటోని చూసిన 20 సెకండ్లలో ఎలుకను గుర్తిస్తే మీకంటే తోపులెవరూ లేరని ఈ ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఎలుక కోసం తెగ వెతికేస్తున్నారు. ఇంతకి మీకు ఎలుక కనిపించిందా లేదా. అయితే జవాబు కోసం కింద ఫొటోను చూసేయండి. రెడ్ కలర్ రింగ్‌లో నక్కి చూస్తోన్న వైట్ ఎలుక కనిపిస్తోంది కనిపించిందా.! మరెందుకు ఆలస్యం మీ ఫన్నీ పజిల్‌ను ఈ ఫ్రెండ్స్‌కి సవాళుగా విసిరి, వారి కళ్ల పవర్‌ను పరీక్షించుకోమనండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..