Prophet remark: మహారాష్ట్రలో ఉదయ్ పూర్ తరహా ఘటన.. కెమిస్ట్‌ను దారుణంగా చంపిన దుండగులు..

Prophet remark: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఉదయ్ పూర్ తరహా ఘటన వెలుగు చూసింది. నుపుర్ శర్మకు మద్ధతుగా సోషల్ మీడియాలో

Prophet remark: మహారాష్ట్రలో ఉదయ్ పూర్ తరహా ఘటన.. కెమిస్ట్‌ను దారుణంగా చంపిన దుండగులు..
Crime
Follow us

|

Updated on: Jul 02, 2022 | 5:19 PM

Prophet remark: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఉదయ్ పూర్ తరహా ఘటన వెలుగు చూసింది. నుపుర్ శర్మకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడనే కారణంతో.. 54 ఏళ్ల కెమిస్ట్‌ని కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాక.. ప్రపంచ వ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. అయితే, నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్ధతు ఇస్తూ కెమిస్ట్ అయిన ఉమేష్ ప్రహ్లాదరావు కొల్హే.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీనిపై ఆగ్రహం చెందిన దుండగులు.. రాత్రి 10 గంటల సమయంలో కొల్హే తన మెడికల్ షాపు నుంచి ఇంటికి వస్తుండగా.. అటాక్ చేశారు. ఉమేష్‌‌ను దారుణంగా నరికి చంపారు.

కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్(32) కోసం గాలిస్తున్నట్లు అమరావతి పోలీస్ కమిషనర్ డాక్టర్ ఆర్తీ సింగ్ తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ‘‘కొల్హే అమరావతి నగరంలో మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కొన్ని వాట్సాప్ గ్రూపులలో ఒక పోస్ట్‌ను షేర్ చేసాడు. అతను తన కస్టమర్లతో సహా కొంతమంది ముస్లింలు కూడా సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో పొరపాటుగా పోస్ట్‌ను షేర్ చేశాడు. దాంతో కొల్హేని చంపాలని ఇర్ఫాన్ ఖాన్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఐదుగురు వ్యక్తుల సహాయం తీసుకున్నాడు. ముద్ద్‌సిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫీక్(24), షోయబ్ ఖాన్(22), అతిబ్ రషీద్(22) కలిసి ఉమేష్‌ను చంపేశారు.’’ అని సిటీ పోలీసులు తెలిపారు.

నుపుర్ శర్మకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు.. ఇదిలాఉంటే.. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై కోల్‌కతా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమెపై కోల్‌కతా పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అంతకుముందు, శర్మను నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. జూన్ 20న స్టేషన్లో లొంగిపోవాలని కోరింది. అప్పుడు రాకపోవడంతో జూన్ 25వ తేదీన హాజరుకావాల్సిందిగా మరోసారి నోటీసులు పంపారు పోలీసులు. అయితే, తనకు ప్రాణహాని ఉందని, భౌతికంగా హాజరుకాలేనంటూ ఆమె పీఎస్‌కు హాజరుకాలేదు. దాంతో కోల్‌కతా పోలీసులు.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..