Viral Photo: దమ్ముంటే కాస్కో.. చిన్న ఫోటోలో పెద్ద జంతువు దాక్కుంది.. 60 సెకన్ల టైమ్.. కనిపెడితే మేధావులే..!
ఫోటో పజిల్స్.. మీలో చురుకుదనాన్ని పెంచడమే కాదు.. మిమ్మల్ని సవాల్ చేస్తుంటాయి. వాటిని సాల్వ్ చేయడంలో కిక్కు వేరుంటదబ్బా.. మరి ఈ స్టోరీ చూడండి..
ఇటీవల ఎన్నో రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్, ఫోటో పజిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిల్లో కొన్ని మన బుర్రను డీప్ ఫ్రై చేసేలా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీటిని చాలామంది నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు. పెయింటింగ్ అయినా, ఫోటో పజిల్ అయినా.. ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఓ సరదా గేమ్ అని చెప్పాలి. పైకి మనకు సమాధానం కనిపిస్తున్నా.. మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. ఇవి గతంలో చేసిన పద సంపత్తి, సుడోకోలు లాంటివి కాదు.. సవాల్ విసురుతాయి. ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే మెదడు చురుగ్గా ఉండటమే కాదు.. కళ్లకు పదును కూడా పెట్టాలి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ జంతువు దాగుంది. అదేంటో మీరు కనుక్కోవాలి. చూడటానికి చెట్టు కొమ్మలా ఉన్న ఆ ప్రదేశంలోనే ఓ జంతువు నక్కి ఉంది. ఆ బెరడు రంగులో జంతువు చర్మం ఇమిడిపోయి ఉండటం వల్ల మీరు దాన్ని కనిపెట్టడం కష్టమే. అయితే కళ్లకు పదునుపెట్టి నిశితంగా ఫోటోను చూస్తే ఈజీగా కనిపెట్టేస్తారు. నూటికి 90 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..