Viral Video: పెళ్లిలో నవ వధువు కత్తి విన్యాసాలు.. అబ్బురపరిచే వీడియో.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

పెళ్లిలో బంధువులు, స్నేహితులు నవ వధూవరులకు విచిత్రమైన ఫన్నీ టాస్క్‌లు ఇచ్చి ఆటపట్టిస్తుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయి..

Viral Video: పెళ్లిలో నవ వధువు కత్తి విన్యాసాలు.. అబ్బురపరిచే వీడియో.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
Bride Stunts
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 02, 2021 | 1:28 PM

పెళ్లిలో బంధువులు, స్నేహితులు నవ వధూవరులకు విచిత్రమైన ఫన్నీ టాస్క్‌లు ఇచ్చి ఆటపట్టిస్తుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయి తరుపు బంధువులైతే, అబ్బాయికి సంబంధించిన వస్తువులు దాచిపెడుతూ, కాసేపు ఫన్‌ క్రియేట్‌ చేస్తుంటారు. అయితే తాజాగా తమిళనాడుకు చెందిన ఓ నవ వధువు, తనలో దాగున్న ఓ కళను చూపించి గ్రామస్తులకు షాక్‌ ఇచ్చింది. మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలను ప్రదర్శించి, పెళ్లికి హజరైవారితో ఔరా అనిపించింది.

తిరుకోలూర్ గ్రామానికి చెందిన నిషాకు రాజ్‌కుమార్‌తో వివాహం జరిగింది. అయితే మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం ఉన్న భార్యతో గ్రామంలో ప్రజలకు మార్షల్‌ ఆర్ట్స్‌పై అవగాహన కల్పించాలనుకున్నారు భార్యభర్తులు. దీంతో నవ వధూవు, కర్రసాముతో పాటు కత్తి చేత పట్టి, చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలను ధరించి మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శించింది నిషా.

కాగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె ప్రతిభకు ఫిదా అవుతున్నారు. వరుసపెట్టి కామెంట్స్, రీ-ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ రావడమే కాకుండా 2.5k లైకులు కూడా సంపాదించింది.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!

రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!