Viral Video: వామ్మో.. ఆ గుద్దుడు ఏంది తల్లి.. ఈ వీడియో చూసి నవ్వి నవ్వి పడిపోవడం గ్యారెంటీ..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫన్నీ వీడియో ఇది.. ఢిల్లీ రోడ్డుపై ఓ జంట బైక్‌పై వెళ్తూ... సడెన్‌గా బాలీవుడ్ ఫైట్ సీన్‌ను తలపించారు. వెనుక కూర్చున్న మహిళ.. ముందున్న వ్యక్తిపై పిడిగుద్దులతో విరుచుక పడింది. ముఖ్యంగా ఆ దెబ్బలకు బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న రొమాంటిక్ పాట తోడై ఈ సీన్‌ను మరింత ఫన్నీగా మార్చేసింది.

సోషల్ మీడియాలో నిత్యం ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. డ్యాన్సులు, వింత విన్యాసాలు వంటివి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇటీవల ఢిల్లీ రోడ్డుపై జరిగిన ఒక విచిత్రమైన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న బైక్‌పై ఓ వ్యక్తితో పాటు మహిళ ఉంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ వెనుక కూర్చున్న ఆ మహిళ ఒక్కసారిగా కోపంతో ఊగిపోవడంతో అసలు కథ మొదలైంది.
తరువాత ఏం జరిగిందంటే..
ఆ మహిళ కోపంతో బైక్ నడుపుతున్న వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించింది. వెనుక నుంచి చూసేవారికి ఇది బాలీవుడ్ సినిమాలో ఫైటింగ్ సీన్ లాగా కనిపించింది. ఆ వ్యక్తి బైక్ నడుపుతూనే ఉన్నాడు, వెనుక నుంచి ఆమె దెబ్బలు వేస్తూనే ఉంది. ఈ మొత్తం సన్నివేశాన్ని బైక్ వెనక వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్, కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు రకరకాల జోకులు వేసుకుంటున్నారు.
ఈ వీడియోలో జరిగిన గొడవ చాలామందికి నవ్వు తెప్పించింది. రోడ్లపై నడుస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చి వాదించుకోవడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఈ ఫైట్‌కి తోడు వీడియో వెనుక వస్తున్న రొమాంటిక్ పాట ఈ సీన్‌ను మరింత ఫన్నీగా మార్చేసింది. నడుస్తున్న బైక్‌పై జరిగిన ఈ అల్లరి ప్రేమకథ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది.
View this post on Instagram
