Viral Video: వామ్మో.. ఈయన మాములోడు కాదు.. గాల్లోని హెలికాప్టర్‌కు వేలాడుతూ ఎలా వర్కవుట్స్ చేస్తున్నాడో మీరే చూడండి..
తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలనుకునేవారు కష్టపడి వర్కవుట్లు, ఎక్సర్ సైజులు చేస్తుంటారు. ఇందుకోసం జిమ్‌కు వెళుతుంటారు. సమయం కుదరకపోతే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేస్తుంటారు.

తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలనుకునేవారు కష్టపడి వర్కవుట్లు, ఎక్సర్ సైజులు చేస్తుంటారు. ఇందుకోసం జిమ్‌కు వెళుతుంటారు. సమయం కుదరకపోతే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఏకంగా హెలికాప్టర్‌కు వేలాడి పుల్‌అప్స్ చేశాడు. అది కూడా గాల్లో ఉండగానే.. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా అతని నైపుణ్యానికి ముగ్ధులయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. అర్మేనియాకు చెందిన రోమన్ సహ్రద్యాన్ (Roman Sahradyan) అనే వ్యక్తికి వర్కవుట్లు, ఎక్సర్‌సైజులు చేయడమంటే చాలా ఇష్టం. ఈక్రమంలోనే గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్‌ను పట్టుకుని వర్కవుట్లు చేశాడీ యంగ్ మెన్.
నిమిషంలో 23 పుల్ అప్స్..
సాధారణంగా చాలామంది పుల్ అప్స్, పుష్ అప్స్ చేసేందుకు ఏవేవో ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ రోమన్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ టేకాఫ్ అవుతోన్న హెలికాప్టర్ పట్టుకుని పుల్ అప్స్ చేశాడు. అదికూడా నిమిషంలో ఏకంగా 23 పుల్ అప్స్ చేశాడు. ఈక్రమంలో ఇలా ఎక్కువ పుల్‌అప్స్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. నెటిజన్లు కూడా అతనిని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇప్పుడే కాదు గతంలోనూ పలు విన్యాసాలు చేశాడు రోమన్.
View this post on Instagram
Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
