AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇప్పుడే ఇలా ఉన్నావేంటమ్మా..! పెళ్లి కూతురు చేసిన పనికి బిత్తరపోయిన వరుడు.. వీడియో

వివాహా వేడుకలో సందడి నెలకొంటుంది. కొంతమంది నృత్యం చేస్తారు.. మరికొంత మంది పాటలు పాడతారు..

Viral Video: ఇప్పుడే ఇలా ఉన్నావేంటమ్మా..! పెళ్లి కూతురు చేసిన పనికి బిత్తరపోయిన వరుడు.. వీడియో
Wedding Video
Shaik Madar Saheb
|

Updated on: May 28, 2022 | 11:38 AM

Share

Wedding Viral Video: సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి పెళ్లంటే రెండు కుటుంబాలకు మాత్రమే కాదు, బంధువులకు కూడా ఎనలేని సంతోషం. వివాహా వేడుకలో సందడి నెలకొంటుంది. కొంతమంది నృత్యం చేస్తారు.. మరికొంత మంది పాటలు పాడతారు.. ఇలా అందరూ ఉత్సాహంతో నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతారు. అందుకే పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వేదికపై వధూవరులు ఒకరికొకరు పూలమాలలు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగిన సన్నివేశం అందర్ని ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు నెటిజన్లను తెగ నవ్విస్తోంది.

ఈ వీడియోలో వధువు.. వరుడు ఇద్దరూ వేదికపై ఉన్నారు. ఈ క్రమంలో వధువు వరుడికి పూలమాల వేస్తుంది. అయితే.. ఈ సమయంలో వధువు కోపంగా కనిపిస్తుంది. బహుశా ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకనో.. లేదా ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగినట్లు అనిపిస్తోంది. సాధారణంగా వధూవరులు ఒకరికొకరు ఆనందంగా పూలమాలలు వేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయి అసంతృప్తితో పెళ్లి చేసుకుంటున్నట్లు అనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. వధూవరులు తమ చేతుల్లో పూల దండతో వేదికపై నిలబడి ఉన్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. వరుడు దండతో హాయిగా నిలబడి ఉండగా.. వధువు మాత్రం కోపంతో ఉంది. వరుడుకి దండ వేసిన వధువు.. ఆ తర్వాత లాగుతుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by Priya Jatav (@priyajatav360)

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియజాతవ్ 360 అనే యూజర్ షేర్ చేయగా.. ఇప్పటివరకు దీనిని 3 లక్షల మంది వీక్షించారు. దీంతోపాటు 11 వేల మందికి పైగా లైక్ చేసి.. పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వధువు వైఖరి చూస్తుంటే.. ఆశ్చర్యం కలిగిస్తుందని.. బహుశా ఈ పెళ్లంటే ఇష్టం లేదేమోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us