AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్యారెట్‌ను క్లారినెట్‌‌గా మార్చి అద్భుతంగా సంగీతం ప్లే చేసిన సంగీత కళాకారుడు.. కళాహృదయం అంటున్న మహీంద్రా

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ సంగీత కళాకారుడు అందరూ తిండడానికి ఉపయోగించే క్యారెట్‌తో వీలును విందుగా సంగీతాన్ని ప్లే చేశారు. ఈ అద్భుతమైన వీడియోను మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు

Viral Video: క్యారెట్‌ను క్లారినెట్‌‌గా మార్చి అద్భుతంగా సంగీతం ప్లే చేసిన సంగీత కళాకారుడు.. కళాహృదయం అంటున్న మహీంద్రా
Carrot Clarinet
Surya Kala
|

Updated on: Mar 06, 2023 | 6:08 PM

Share

మహాకవి శ్రీ శ్రీ అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, సిగ్గుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు..అవును కళాహృదయం ఉండాలేకానీ, ప్రతిదానిలోనూ కళాత్మకతే కనిపిస్తుంది. అనేక అద్భుతాలను సృష్టించేలా చేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ సంగీత కళాకారుడు అందరూ తిండడానికి ఉపయోగించే క్యారెట్‌తో వీలును విందుగా సంగీతాన్ని ప్లే చేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంగీత కళాకారుడు ఓ కూరగాయను మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌గా మార్చేసి ఎంతో అందంగా సంగీతం పలికించారు. అవును, ఇతను ఓ క్యారెట్‌ను ‘క్లారినెట్‌’గా మలచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముందుగా సంగీతకారుడు లిన్సే పొల్లాక్  క్యారెట్‌కు రంధ్రాలు చేసి క్లారినెట్‌గా మార్చాడు. ఆపై అతను బటన్ వద్ద ఒక గరాటును అమర్చాడు .. పైన శాక్సోఫోన్ మౌత్‌పీస్‌ను ఉంచాడు. అంతేకాదు, దానిపై ఎంతో అద్భుతంగా సంగీతం ప్లే చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియోను మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. మనచుట్టూ ఉండే ప్రతిదానిలోనూ సంగీతం దాగిఉంది.. దానిని గుర్తించే కళాహృదయం ఉండాలి’ ఇదే ఈ వీడియోనుంచి నేను పొందిన సందేశం అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు.

అద్భుతమైన ఈ వీడియోను ఇప్పటికే 5 లక్షలమందికి పైగా వీక్షించారు. వీడియోపై స్పందించిన ఓ యూజర్‌ మీ చుట్టూ ఉన్నవాటిలో సంగీతాన్ని గుర్తించొచ్చు.. మీరు చేసే ప్రతిపనిలో సంతోషాన్ని గుర్తించొచ్చు అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..