Watch: తెలివైన వాడికి ఉండాల్సిన లక్షణాలు..! ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన జీవిత పాఠాలు..! ఇనుప కంచె దాటిన గజరాజు..
ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో 5 వేల మందికి పైగా లైక్ చేసారు. ఇది కాకుండా అనేక మంది నెటిజన్లు వీడియోపై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. కష్టమైన రోజును ప్రారంభించడానికి ఇది ఒక మంచి సూచన అని, మరొకరు ఇది మంచి పాఠం అంటున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది. అందులో అతను జీవితానికి సంబంధించిన పాఠం నేర్చుకున్నానంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే...
మానవుల తర్వాత, జంతువులలో అత్యంత తెలివైనది ఎవరంటే.. అది ఏనుగు మాత్రమే. గజరాజు పేరుకు తగినట్టుగానే.. బలానికే కాదు తెలివితేటలకు కూడా పేరుగాంచాడు. ఏనుగుల తెలివితేటలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ కావటం చూస్తుంటాం. అలాంటి మరో వీడియో ఇక్కడ ట్విట్టర్ వేదికగా హల్‌చల్ చేస్తోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది. అందులో అతను జీవితానికి సంబంధించిన పాఠం నేర్చుకున్నానంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే…
వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే.. అదేదో రద్దీగా ఉన్న రహదారిగా తెలుస్తుంది. రహదారిని ఆనుకుని ఉన్న అడవిలోంచి ఒక ఏనుగు జాగ్రత్తగా రహదారి కంచెను దాటేందుకు ప్రయత్నిస్తుంది. ఆ ఏనుడు మొదట మెల్లి మెల్లిగా తన పాదంతో వైర్‌ను తాకడానికి ప్రయత్నిస్తుంది.. చూస్తుంటే ఆ జంతువు అక్కడున్న కంచెకు కరెంట్ ఉందో లేదో అర్థం చేసుకునేందుకు ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది! దారి సురక్షితమని గ్రహించిన గజరాజు ఆ తర్వాత కంచెను, కంచెకు సపోర్ట్‌గా నాటిన స్తంభాలను కూల్చివేసి.. తీగలు తొక్కుతూ సులువుగా రోడ్డు దాటేసింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా (@anandmahindra) ట్విట్టర్‌లో షేర్ చేశారు.
వీడియోకి క్యాప్షన్‌గా.. ఏనుగు మాస్టర్‌ప్లాన్.. జీవితంలో చిన్న, పెద్ద సవాళ్లను అధిగమించడానికి ఏదైనా నేర్చుకోవచ్చు. ఒక మార్గం కష్టంగా అనిపించినప్పుడు, ముందుగా సవాలు ఎంత క్లిష్టమో, మీరు దాని ముందు నిలబడగలరా లేదా అని పరీక్షించడానికి ప్రయత్నించండి. అప్పుడు దాని నుండి పూర్తి విశ్వాసంతో బయట పడగలుగుతారు. అప్పుడు మీ బలం రెట్టింపు అవుతుంది.
A masterclass from a pachyderm on how to overcome obstacles: 1) Carefully test how strong the challenge really is & where it might have least resistance. 2) Slowly apply pressure at the point of greatest leverage of your own strength. 3) Walk confidently through… 😊 pic.twitter.com/SmYm8iRWKH
— anand mahindra (@anandmahindra) August 4, 2023
ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో 5 వేల మందికి పైగా లైక్ చేసారు. ఇది కాకుండా అనేక మంది నెటిజన్లు వీడియోపై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. కష్టమైన రోజును ప్రారంభించడానికి ఇది ఒక మంచి సూచన అని, మరొకరు ఇది మంచి పాఠం అంటున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తుంది.
ఇదిలా ఉంటే, అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఆహారం, నీటి కోసం వెతుక్కుంటూ తరచూ గ్రామాల బాటపడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా సందర్భాల్లో ఏనుగులు విద్యుత్ వైర్లకు తగిలి చనిపోవటం కూడా జరుగుతుంది. ఇటీవలే అసోంలోని గువాహటిలో టీ తోటలోకి ప్రవేశించిన మూడు ఏనుగులు కరెంట్ షాక్‌తో మరణించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. వాటికి అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..