Viral Video: చిన్న సీసాలో అద్భుతమైన పెయింటింగ్.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్ .. చిత్రకారుడిపై ప్రశసంలు వర్షం..
ఒక చిన్న గాజు సీసా ను తీసుకున్నారు.. దాని లుక్ చూస్తే బహుశా నెయిల్ పాలిష్ బాటిల్ అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఆ సీసా లోపల పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఏం చేస్తున్నాడో .. అనే ఆలోచనల వస్తుంది..
Viral Video: కళ ఏ ఒక్కరి సొంతం కాదు.. తమ అద్భుతమైన ప్రతిభతో ఎన్నో కళాకండాలను సృష్టించే అద్భుతమైన ప్రతిభావంతులైన వ్యక్తులు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నారు. ఇలాంటి ప్రతిభాపాటవాల గల వ్యక్తులను చూసినప్పుడు అద్భుతం అనిపించడమే కాదు.. ఆశ్చర్యానికి లోనవుతాము. కొందరు తమ గాత్రంతో, మరికొందరు నృత్యంతో, ఇంకొందరు అద్భుతమైన పెయింటింగ్ ను రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. సాధారణంగా పెయింటర్లు కాన్వాస్ మీదనో, తెల్లటి పేజీలోనో బొమ్మలను వేస్తారు. అయితే ప్రస్తుతం మనిషి.. సరికొత్తగా తమ ప్రతిభను ప్రదర్శించి.. నలుగురిలో భిన్నమైన గుర్తింపుని తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో ఇసుక, రాళ్లు, పగిలిన గాజులు, ధాన్యం ఇలా అన్నీ పెయింటింగ్స్ ను వేయడానికి సాధనాలుగా చేసుకుంటున్నారు.. అద్భుతమైన కళాకండాలను సృష్టిస్తున్నారు. దేవుడు అద్భుతమైన ప్రతిభను అందించిన అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను ఒక చిన్న సీసాలో ఎంతో ఈజీగా అద్భుతమైన పెయింటింగ్‌ను వేస్తాడు. ఇలాంటి కళను ప్రదర్శించే చిత్రకారుడిని చూడడం బహుఅరుదుగా జరుగుతుంది. షాకింగ్ కలిగించే ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఒక చిన్న గాజు సీసా ను తీసుకున్నారు.. దాని లుక్ చూస్తే బహుశా నెయిల్ పాలిష్ బాటిల్ అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఆ సీసా లోపల పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఏం చేస్తున్నాడో .. అనే ఆలోచనల వస్తుంది.. అయితే క్షణ క్షణం గడిచిన తర్వాత ఓ రూపం దర్శనమిస్తూ.. ఆ బాటిల్ లో అతను ఏమి చేస్తున్నాడో అర్థమవుతోంది. ఆ చిన్న సిసాలో అందమైన పెయింటింగ్ వేసాడు. అలాంటి పెయింటింగ్‌ను కాగితంపై లేదా కార్డు బోర్డుపై కూడా వేయాలంటే.. ఎలా వేయాలి అంటూ 100 సార్లు ఆలోచిస్తారు. ఈ వ్యక్తికి ఎడమ చేయి వాటం కలిగిన వ్యక్తిగా వీడియో చూస్తుంటే తెలుస్తుంది. తన ఎడమ చేతితో బాటిల్ లో అత్యంత ఆకర్షణీయమైన పెయింటింగ్‌ను.. అత్యంత వేగంగా సృష్టించాడు.
View this post on Instagram
ఈ అద్భుతమైన వీడియో xiang.duan అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagramలో షేర్ చేశారు. ఈ ఖాతాలో ఇలాంటి అనేక కళాఖండాలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసి మంత్రముగ్ధులవ్వాలి. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఒక సీసాపై రాజు పెయింటింగ్‌ను, మరికొన్ని వివిధ రకాల జంతువులతో అద్భుతమైన కళాకృతిని పెయింట్ చేశాడు. ఈ అద్భుతమైన ప్రతిభను చూసి ఆ వ్యక్తి ప్రతిభకు నెటిజన్లు ఫిదా..
View this post on Instagram
మరిన్ని వైరల్ న్యూస్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..