Train: ట్రైన్ నడుపపుతుండగా ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. అనుమానంతో లోకోపైలట్ చెక్ చేయగా.. షాక్.!
పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ట్రైన్ జర్నీలో ఉండగా.. ఇంజిన్‌లో కూర్చున్న లోకోపైలట్‌కు ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. చుట్టుపక్కల అంతా వెతికాడు
పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ట్రైన్ జర్నీలో ఉండగా.. ఇంజిన్‌లో కూర్చున్న లోకోపైలట్‌కు ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. చుట్టుపక్కల అంతా వెతికాడు కానీ ఎవరూ కనిపించలేదు. దీంతో అతనికి ఒక రకమైన భయం కలిగింది. ట్రైన్ ముందుకు వెళ్తున్నా లోకోపైలట్ మనసులో ఏదో టెన్షన్‌గా అనిపించింది. దీంతో భయంభయంగానే రైలును నడుపుతున్నాడు. గయా జంక్షన్లో రైలు ఆగిన తర్వాత.. ఎందుకైనా మంచిదని ఇంజిన్ కింది భాగాన్ని ఓసారి చెక్ చేశాడు . టార్చ్‌లైట్ వేసి చూసి.. ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. ఇంజిన్ కింది భాగంలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూశాడు. వెంటనే తేరుకున్న లోకోపైలట్.. స్థానిక రైల్వే స్టేషన్ సిబ్బందికి విషయం తెలియజేశాడు. ఈలోగా సదరు వ్యక్తి మంచినీళ్లు కావాలని అరుస్తున్నట్లు అతను గుర్తించాడు. కొందరు ప్రయాణికుల సాయం తీసుకొని యువకుడిని బయటకు తీశాడు. అయితే, అంతలోనే ఆ యువకుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. యువకుడి వివరాలేవీ తెలియలేదు. ఈ విషయంపై డ్రైవర్.. రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు.రైల్ఇంజిన్ కింద వేలాడుతూ ఆ వ్యక్తి వందల కిలోమీటర్లు ప్రయాణించినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. బిహార్‌లోని గయాకు చేరుకున్న తర్వాత లోకోపైలట్ అతడిని గుర్తించాడు. ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని అధికారులు భావిస్తున్నారు. రాజ్‌గిర్‌లో యువకుడు రైలు ఎక్కి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. అతడు క్షేమంగా అంత దూరం ప్రయాణించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

