Viral Video: సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న వ్యక్తి. ఒక్కసారిగా ఏం జరిగిందో చూస్తే వెన్నులో వణుకు
అసోం కాజీరంగా నేషనల్ పార్కులోని హల్దీబాడీ జంతు కారిడార్ వద్ద అనూహ్య ఘటన జరిగింది. అదేంటో వీడియోలో మీరే చూడండి.
Trending Video: మీ మానాన మీరు వెళ్తుంటే.. ఒక్కసారిగా ఊహించని విధంగా క్రూర మృగం దాడిచేస్తే ఎలా ఉంటుంది. వెన్నులో వణుకు పుడుతుంది కదూ. అసోం(Assam)లో ఓ వ్యక్తి అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. కజీరంగా నేషనల్ పార్కు( Kaziranga National Park)లోని హల్దీబాడీ జంతు కారిడార్ వద్ద షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిపై పొదల్లోంచి దూకి ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది ఓ చిరుతపులి. దీంతో అతను సైకిల్‌పై నుంచి కిందపడ్డాడు. అయితే రోడ్డుపై వాహనాల సంచారం ఉండటంతో.. ఆ చిరుత అతన్ని ఏం చేయకుండా మళ్లీ పొదల్లోకి వెళ్లిపోయింది. ఫేట్ బాగుండటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రజంట్ ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికులు పార్క్ సమీపంలో ఆగవద్దని కజిరంగా నేషనల్ పార్క్‌లో పనిచేస్తున్న రమేష్ కుమార్ గొగోయ్ కోరారు. అడవి జంతువులు తరచుగా రహదారికి సమీపంలో తిరుగుతున్నందున సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Kaziranga National Park drowned in devastating #Flooding. Animals are in anger. CCTV footage of a leopard attacking cyclist on national highway near Kaziranga, #Assam pic.twitter.com/YKTLJ6jlbO
— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) June 14, 2022
మరిన్ని జాతీయ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి