Viral News: ఆ సెలబ్రెటినీ ట్విట్టర్ లో ఏకేస్తున్న జనం.. సంచలనమవుదామనుకుని..నవ్వులు పాలు..ఇంతకీ ఏం చేశాండటే..
ఒక్కోసారి సంచలనం సృష్టిద్దామంటూ అంటూ చేసే పనులు రివర్స్ లో మనల్నే నవ్వులపాటు చేస్తాయి. ఇప్పుడు ఇదే కోవలో చేరారు ప్రముఖ నటుడు సతీష్ షా, ఇంతకీ ఆయన ఏం చేశారనుకుంటున్నారా..
Viral News: ఒక్కోసారి సంచలనం సృష్టిద్దామంటూ అంటూ చేసే పనులు రివర్స్ లో మనల్నే నవ్వులపాటు చేస్తాయి. ఇప్పుడు ఇదే కోవలో చేరారు ప్రముఖ నటుడు సతీష్ షా, ఇంతకీ ఆయన ఏం చేశారనుకుంటున్నారా.. మరో 5రోజులు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను వాట్సప్ డీపీలుగా, సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్స్ గా పెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో నటుడు సతీష్ షా తాను చేతితో పట్టుకున్న త్రివర్ణ పతకాన్ని గర్వంగా చూపిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆఫోటోకి ఇచ్చిన క్యాప్షనే అసలు వివాదానికి తెరలేపింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా1942 లో మా అమ్మకు లభించిన తిరంగ్ ధ్వజ్ అంటూ పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సతీష్ షా ఫై ఫైర్ అవుతున్నారు.
సతీష్ షా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన త్రివర్ణ పతాకం మధ్యలో అశోక్ చక్రం ఉంది. అయితే 1942లో భారత జెండా మధ్యలో చరఖా ఉండేది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక చరఖా స్థానంలో అశోక్ చక్ర చేరింది. 1921లో గాంధీజీ కోరిక మేరకు పింగళి వెంకయ్య జాతీయ పతకాన్ని డిజైన్ చేశారు. కొన్ని మార్పులతో దానిని స్వరాజ్య పతాకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపయోగించారు. ఆతర్వాత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చరఖా స్థానంలో అశోక్ చక్రను చేర్చి భారత జాతీయ జెండాగా ఆమోదించారు. అయితే 1942లోనే అశోక్ చక్రతో కూడిన జాతీయ జెండా ఉందంటూ సతీష్ షా ట్వీట్ చేయడంతో మీరు పోస్టు చేసిన త్రివర్ణ పతాకం ఎప్పటిదో వాస్తవం తెలుసుకోవాలని కొందరు నెటిజన్లు సూచించారు. చరిత్ర తెలుసుకోండి అంటూ మరికొందరు క్లాస్ పీకారు. మాకు తెలిసినంత వరకు 1947లో జాతీయ జెండాపై అశోక చక్రను చేర్చారు. 1942లో మీకు, మీఅమ్మగారికి ఎలా వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు. సతీస్ సా అందరికీ క్షమాపణలు చెప్పాలని కొందరు అంటుంటే.. ఈరోజుల్లో అబద్ధాలు చెప్పడం చాలా సులభం.. అందులో సెలబ్రెటీలు దేశభక్తిని ఉపయోగించుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. దీనిపై ఇప్పటి వరకు సతీష్ షా స్పందించలేదు.
The very same TIRANGA DHWAJ my mother had got during Quit India Movement 1942 pic.twitter.com/gIk64iOCnY
— satish shah?? (@sats45) August 9, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం