Trending Video: పాముతో పెట్టుకుంటే ఇలానే ఉంటది మరి.. సింహాలనే వణికించేసింది.. వైరల్ వీడియో మీ కోసం..
అడవికి రాజు సింహం. దాని ముందు ఎలాంటి జంతువైనా బలాదూరే. వేటాడే తీరు, శక్తియుక్తుల ముందు మరే ఇతర జంతువూ నిలవలేదు. సింహాలు అంటే కేవలం అడవి జంతువులకు మాత్రమే కాదు.. జనాలకూ...

అడవికి రాజు సింహం. దాని ముందు ఎలాంటి జంతువైనా బలాదూరే. వేటాడే తీరు, శక్తియుక్తుల ముందు మరే ఇతర జంతువూ నిలవలేదు. సింహాలు అంటే కేవలం అడవి జంతువులకు మాత్రమే కాదు.. జనాలకూ భయమే. ఈ భూమిపై వేలాది జంతువులు ఉన్నాయి. వాటిలో పాములు కూడా ఉంటాయి. పాము ఎదురుగా కనిపిస్తే చాలు.. అక్కడి నుంచి పారిపోతుంటారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోతారు. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి. కాటు వేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ఇక.. సింహం, సర్పం రెండూ కలిస్తే.. సీన్ వేరే లెవెల్ ఉంటుంది కదా.. హా.. అవునవును.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే.
వైరల్ అవుతున్న క్లిప్ లో రెండు సింహాలు.. అడవిలో వెళ్తుంటాయి. అదే సమయంలో వారికి ఎదురుగా ఒక పాము వస్తంది. అంతే ఆ సింహాలు ఆ పామును చూసి అక్కడే ఆగిపోతాయి. నాగు పాము కూకడా అంతే అలర్ట్ గా మారి.. సింహాలను భయపెడుతుంది. సింహాలతో పెట్టుకుంటే తన ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయని భావించి.. చల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది.




View this post on Instagram
వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం.. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వీడియోకు ఇప్పటి వరకు 11 వేలకు పైగా లైక్స్ రాగా.. ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. పాములు ఎంత ప్రమాదకరమో సింహానికి కూడా తెలుసునని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి