AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చిరుతలా దూకి, ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయర్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

NZ vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మైకేల్ బ్రేస్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Video: చిరుతలా దూకి, ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయర్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Michael Bracewell VideoImage Credit source: Spark sport
Venkata Chari
|

Updated on: Feb 24, 2023 | 6:00 PM

Share

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ వెల్లింగ్టన్‌లో జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి మూడు వికెట్లు కేవలం 21 పరుగులకే పడిపోయాయి. అయితే, టిమ్ సౌథీ వేసిన బంతిని బెన్ డకెట్ స్లిప్‌లో ఆడాడు. అక్కడే ఉన్న మైకేల్ బ్రేస్‌వెల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌ను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తుంది. బ్రేస్‌వెల్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి, ఒంటి చేత్తో క్యాచ్‌ని పట్టుకున్నాడు.

అయితే మ్యాచ్ తొలి రోజు ఇలాంటి అద్భుతమైన క్యాచ్ తర్వాత కూడా ఆతిథ్య జట్టుకు సంబరాలు చేసుకునే అవకాశం రాలేదు. జో రూట్, హ్యారీ బ్రూక్ కలిసి కివీ బౌలర్ల బ్యాండ్ వాయించారు. వర్షం కారణంగా మొదటి రోజు 65 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. రూట్ 101, బ్రూక్ 184 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..