Harry Brook: ప్రపంచకప్ జట్టు నుంచి గెంటేశారు.. కట్ చేస్తే.. 9 ఇన్నింగ్స్‌లలో 807 పరుగులు బాదేశాడు..
టెస్టు క్రికెట్‌లో హ్యారీ బ్రూక్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బ్రూక్ తన...
న్యూజిలాండ్‌కు ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పెద్ద తలనొప్పిగా మారాడు. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ.. మరో మెరుపు సెంచరీని నమోదు చేశాడు. వెల్లింగ్టన్ వేదికగా కివీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 3 వికెట్లు నష్టపోయి 315 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(184), జో రూట్(101) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో హ్యారీ బ్రూక్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బ్రూక్ తన కెరీర్‌లో ఆరో టెస్టు మ్యాచ్‌ను ఆడుతున్నాడు. కేవలం 9 ఇన్నింగ్స్‌లలోనే 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో 807 పరుగులు చేశాడు. అరంగేట్రం చేసిన అతి తక్కువ టెస్టుల్లోనే ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా బ్రూక్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు తొలి 9 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 798 పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి.. దిగ్గజాల లీగ్‌లోకి అడుగుపెట్టాడు హ్యారీ బ్రూక్. ఇక ఈ ఘనత సాధించినవారిలో తొలి రెండు స్థానాల్లో ఉన్న సునీల్ గవాస్కర్ (912), డాన్ బ్రాడ్‌మాన్ (862)లను సైతం దించేసి.. బ్రూక్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం లేకపోలేదు. టెస్ట్ రెండో రోజు కూడా ఇదే ఆటతీరును హ్యారీ బ్రూక్ కనబరిస్తే.. అది తప్పక సాధ్యం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
బ్రూక్ టెస్ట్ గణాంకాల విషయానికొస్తే.. ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్‌లలో 100.88 సగటుతో 807 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో అతడి స్ట్రైక్ రేట్ 99.38 కాగా ఉంది. అలాగే బ్రూక్ బ్యాట్ నుంచి 101 ఫోర్లు, 20 సిక్సర్లు వచ్చాయి. కాగా, గతంలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్యవహరించాడన్న సంగతి మీకు తెలుసా.? న్యూజిలాండ్‌లో జరిగిన 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు నుంచి హ్యారీ బ్రూక్‌ను సస్పెండ్ చేసింది టీమ్ మేనేజ్‌మెంట్. నిజానికి అతడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు జట్టు నుంచి తొలగించబడ్డాడు. బ్రూక్ క్రమశిక్షణా రాహిత్యం కారణంగా.. అతడ్ని బెంచ్‌కే పరిమితం చేశారు. కానీ ఆ తర్వాత హ్యారీ బ్రూక్ తన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఫ్యూచర్ సూపర్ స్టార్‌గా పేరుగాంచాడు.
4 Tons & 3 Fifties in 5 Test Matches ? What a Magnificent start at the early stage of Career for Harry Brook.. Wishing you to be our Match-Winner at @SunRisers ??pic.twitter.com/OBDnP6YY0x
— Rôhîth (@Rohith_sPyD3r) February 24, 2023