Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ధోని టెన్షన్ పెట్టినా.. వన్డేలో తొలి డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్.. వైరల్ వీడియో..

Sachin Tendulkar: ఫిబ్రవరి 24, 2010న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో 200 పరుగుల మార్కును దాటిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Video: ధోని టెన్షన్ పెట్టినా.. వన్డేలో తొలి డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్.. వైరల్ వీడియో..
Sachin Odi Double Century
Follow us
Venkata Chari

|

Updated on: Feb 24, 2023 | 3:53 PM

Sachin Tendulkar ODI Double Hundred: భారత జట్టు మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో 13 ఏళ్ల క్రితం ఇదే రోజున చరిత్ర సృష్టించాడు. ఫిబ్రవరి 24, 2010న, క్రికెట్ గాడ్ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టెండూల్కర్ 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ స్ట్రైక్ రేట్ 136.05గా నిలిచింది.

స్పెషల్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ..

సచిన్ టెండూల్కర్ ఈ ప్రత్యేకమైన డబుల్ సెంచరీని గుర్తుచేసుకుంటూ, బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంది. “2010లో ఇదే రోజున, సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో మొదటి డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు” అంటూ వీడియోను షేర్ చేసింది.

టెన్షన్ పెట్టిన ధోని.. ఆగ్రహించిన అభిమానులు..

సచిన్ 199 పరుగుల వద్ద ఉన్నప్పుడు, క్రీజులో ఉన్న ధోని బౌండరీల వర్షం కురిపిస్తూ.. సచిన్‌కు బ్యాటింగ్ ఇవ్వకుండా కొద్దిసేపు అభిమానుల్లో టెన్షన్ పెంచాడు. ఈ క్రమంలో సచిన్ 200 పరుగులు పూర్తి చేసేందుకు దాదాపు 12 బంతులు ఆగాల్సి వచ్చింది.

మాస్టర్ బ్లాస్టర్ అంతర్జాతీయ కెరీర్..

వన్డేల్లో కాకుండా టెస్టు క్రికెట్‌లో సచిన్ మొత్తం 6 సార్లు 200 పరుగులను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 53.79 సగటుతో 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతను 6 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. వన్డేల్లో 44.83 సగటుతో 18426 పరుగులు చేశాడు. ఇందులో సచిన్ మొత్తం 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో డబుల్ సెంచరీ కూడా చేరింది. అదే సమయంలో, సచిన్ ఏకైక టీ20 ఇంటర్నేషనల్‌ ఆడి, 10 పరుగులు చేశాడు.