Telugu News Trending A video of a fan set up to keep cattle away from mosquitoes has gone viral on social media Telugu News
Video Viral: “పశువులంటే మాకు ప్రాణం.. వాటి కోసం ఏమైనా చేస్తాం”.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న వీడియో
చిన్న చిన్న టిప్స్ తో అద్భుతాలు చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. వారు తమ దగ్గర ఉండే వస్తువులతోనే సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) చాలా ఉన్నాయి. రీల్స్, షార్ట్స్...
చిన్న చిన్న టిప్స్ తో అద్భుతాలు చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. వారు తమ దగ్గర ఉండే వస్తువులతోనే సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) చాలా ఉన్నాయి. రీల్స్, షార్ట్స్ వంటివాటిలో చాలా వరకు ఇలాంటివే. అందుకే అలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. వర్షాకాలంలో దోమలు రావడం సహజమే. వాటర్ స్టాక్ ఉండటం, చెట్లు పెరగడం, అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు వ్యాప్తి చెందుతాయి. వీటిని అరికట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాయిల్స్ వెలిగించడం, ఆలౌట్ వంటివి పెట్టుకోవడం, కిటికీలు, మంచాలకు దోమతెరలు పెట్టించుకుంటారు. మనుషులు సంగతి సరే..మరి జంతువులు పరిస్థితి ఏమిటి.. సరిగ్గా ఈ విషయం గురించే ఆలోచించిన ఓ వ్యక్కి మంచి పరిష్కారం కనుగొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో పశువులు కొట్టంలో దోమల బెడదతో ఇబ్బంది పడుతున్న జీవులకు వాటి యజమాని చిన్న ట్రిప్ ఫాలో అయ్యాడు. ఒక చోట పొగ వేసి అక్కడ టేబుల్ ఫ్యాన్ అమర్చాడు. దానిని ఆన్ చేసి మూవింగ్స్ ఇవ్వడం వల్ల పొగ కూడా అదే దిశలో కదులుతుంది. పొగను గదిలోని ప్రతి మూలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో కు ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆలోచన దేశం దాటి వెళ్లకూడదు.. లేకుంటే విదేశీయులు కూడా ఈ ఐడియాను ఉపయోగించుకుంటారని వ్యాఖ్యానిస్తున్నారు.