AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆదాయవనరుగా సీజ్ చేసిన మద్యం సీసాలు.. వేలాది మందికి ఉపాధి.. ఎలాగో తెలిస్తే మైండ్ బ్లాంక్..

ఏ వస్తువు పనికిరాకుండా పోదంటారు. ఇది అక్షరలా నిజం. ఆలోచించాలే కాని.. ప్రతి వస్తువుని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా వాటర్ తాగేసిన తర్వాత వాటర్ బాటిల్స్.. మద్యం సీసాలు.. ఇలా పనికిరావు..

Viral News: ఆదాయవనరుగా సీజ్ చేసిన మద్యం సీసాలు.. వేలాది మందికి ఉపాధి.. ఎలాగో తెలిస్తే మైండ్ బ్లాంక్..
Bangels
Amarnadh Daneti
|

Updated on: Sep 08, 2022 | 10:57 AM

Share

Viral News: ఏ వస్తువు పనికిరాకుండా పోదంటారు. ఇది అక్షరలా నిజం. ఆలోచించాలే కాని.. ప్రతి వస్తువుని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా వాటర్ తాగేసిన తర్వాత వాటర్ బాటిల్స్.. మద్యం సీసాలు.. ఇలా పనికిరావు అనుకునే వాటిని రీసైకిల్ చేయడం ద్వారా వీటిని ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సరిగ్గా బీహార్ ప్రభుత్వం ఇదే పనిచేసింది. బీహార్ మద్యపాన నిషేధం అమలవుతోంది. అయినా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మద్యాన్ని అనుమతులు లేకుండా తీసుకొస్తున్నారు. ఈక్రమంగా అధికారులు తనిఖీలు నిర్వహించి మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఇలా కొన్ని లక్షల లీటర్ల మద్యం బాటిళ్లను అధికారులు సీజ్ చేయగా.. అవన్నీ పనికిరాకుండా ఉన్నాయి. దీంతో వాటి ద్వారా ఆదాయం ఎలా అర్జించాలే దానిపై ఆలోచించి.. సీజ్ చేసిన మద్యం బాటిళ్లను రీసైకిల్ చేసి బ్యాంగిల్స్ తయారుచేయాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా మహిళలకు ఉపాధి కూడా కల్పించనుంది.

2015 నుండి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిస్తుండటంతో.. అధికారులు సోదాలు నిర్వహించి భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లు స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. ఇవ్వన్నీ వేస్ట్ గా ఉంటుండటంతో బీహార్ ప్రభుత్వం మద్యం బాటిళ్లను రీసైకిల్ చేసి గాజులు తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని గాజుల తయారీ యూనిట్ తో ఒప్పందం చేసుకుంది. మద్యం బాటిళ్లతో గాజులను ఎలా తయారు చేయాలో బీహార్ కు చెందిన మహిళకు ఈసంస్థ శిక్షణ ఇస్తుంది. ఆతర్వాత బీహార్ లో మద్యం బాటిళ్లతో గాజులు తయారుచేసే పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపాధి కూడా లభించనుంది. గాజుల తయారీకి కావల్సిన ముడిసరుకులను ప్రభుత్వమే మహిళలకు అందించనుంది. ఇప్పటికే మహిళల శిక్షణ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వమే మహిళలకు అవసరమైన శిక్షణను ఇప్పిస్తోంది. ఇప్పటికే ఒక బృందం ఫరూఖాబాద్‌లో శిక్షణ పొందుతోంది. గాజుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేసిన మద్యం బాటిల్స్ ను పాట్నాకు తరలించాలని ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..