రక్తపు వాంతులు చేసుకున్న యువకుడు.. స్కానింగ్ రిపోర్టు చూసి బిత్తరపోయిన డాక్టర్లు
ఈ ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కోవిధమైన అలవాటు, ప్రవర్తనలు ఉంటాయి. ఇంకొంతమంది కొంచెం విచిత్రంగా కూడా ప్రవర్తిస్తుంటారు.

ఈ ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కోవిధమైన అలవాటు, ప్రవర్తనలు ఉంటాయి. ఇంకొంతమంది కొంచెం విచిత్రంగా కూడా ప్రవర్తిస్తుంటారు. గాల్లో స్టంట్లు చేయడం, నీటిలో ఎక్కువ సేపు ఊపిరి బిగపట్టుకోని ఉండటం లాంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. కొంతమంది గుర్తింపు కోసం చేస్తుంటారు. మరికొంతమంది కావాలనే చేస్తుంటారు. అలాంటి పనులు కొన్నిసార్లు వాళ్ల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే రాజస్థాన్ కి చెందిన 25 ఏళ్ల యువకుడు అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు. అయితే ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఉన్నట్లుండి ఆ యువకుడు రక్తపు వాంతుల చేసుకుని తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ డాక్టర్ నర్సిరామ్ దేవాసి ఆ యువకుడి సమస్యం ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయించారు. అయితే ఆ వ్యక్తి కడుపులో ఏదో లోహం ఉన్నట్లు కనిపించింది . దీంతో అతనికి సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించగా..డాక్టర్లు బిత్తరపోయారు. ఆ వ్యక్తి కడుపులో ఏకంగా 56 బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు ఆ 56 బ్లేడులు తీసేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అతను బ్లేడ్లను కవర్లతో సహా తిన్నాడని అందువల్లే అవి తింటున్నప్పుడూ నొప్పిగానీ, రక్తస్రావం గానీ జరగలేదని పేర్కొన్నారు. అయితే అవి కడుపు లోపలికి చేరాక కాగితం మొత్తం కరిగిపోయి బ్లేడ్లు ఉండటంతో.. క్రమంగా అతని ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. దీంతో ఆ వ్యక్తి లోపల గ్యాస్ ఏర్పడి అతనికి వికారం వచ్చి వాంతులు రావడం జరిగిందని తెలిపారు. మరో విషయం ఏంటంటే అతను ఆ బ్లేడు తినేటప్పుడే వాటిని రెండుగా విడగొట్టి మరీ తిన్నాడని చెప్పారు. అతను అలా బ్లేడ్లు మింగడానికి గల అలవాటుకి కారణాలేంటో తమకు తెలియదని అతడి బంధువులు స్నేహితులు చెబుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
