AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాబ్‌ పోయినా ఉన్నట్టే నటించాడు.. అబద్ధంతో అంతకు మించిన జాబ్‌ కొట్టాడు.. ఇంతకు అతనెవరో తెలుసా?

ఉన్నపలంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తే ఏం చేస్తారు.. మరో ఉద్యోగం వెతుక్కుంటారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం ఉద్యోగం పోయినా ఉన్నట్టు నటించి.. లింక్‌డిన్‌లో ఫేక్‌ ప్రాజెక్టు పోస్ట్‌లు పెడుతూ పోయిన ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగాన్ని సంపాధించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ యువకుడే తన సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకోగా, అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

జాబ్‌ పోయినా ఉన్నట్టే నటించాడు.. అబద్ధంతో అంతకు మించిన జాబ్‌ కొట్టాడు.. ఇంతకు అతనెవరో తెలుసా?
Reddit User
Anand T
|

Updated on: Jun 29, 2025 | 3:54 PM

Share

ఉన్నపలంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తే ఏం చేస్తారు.. మరో ఉద్యోగం వెతుక్కుంటారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం ఉద్యోగం పోయినా ఉన్నట్టు నటించి.. లింక్‌డిన్‌లో ఫేక్‌ ప్రాజెక్టు పోస్ట్‌లు పెడుతూ పోయిన ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగాన్ని సంపాధించాడు. వివరాళ్లోకి వెళితే.. రెడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక యూజర్ ఒక పోస్ట్‌ చేశాడు. అందులో తన జీవితంలో ఎదురైన ఓ విచిత్ర సందర్భం గురించి ఇలా వివరించాడు. గత ఆగస్టు నెలలో తనను అనుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారని.. కనీసం ఎటువంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపాడు.’సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందని అందుకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు 3 నిమిషాల జూమ్ కాల్‌తో విషయం తేల్చేశారన్నారు.

అయితే, ఉద్యోగం కోల్పోయాక ఏం చేయాలో అర్థం కాలేదని, దీంతో జాబ్‌ పోయిన విషయాన్ని స్నేహితులు, మాజీ సహోద్యోగులతో సహా ఎవరికీ చెప్పలేదని తెలిపాడు. తాను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నట్టు నటిస్తూ.. రోజూ ఉదయం ల్యాప్‌టాప్ తెరిచి, బిజీగా ఉన్నట్టు నటించేవాడినని చెప్పాడు. జూమ్‌ మీటింగ్స్‌, ఫోన్‌ కాల్స్‌లోఉన్నట్టుగా ఎయిర్‌ఫోన్స్‌ పెట్టుకుని తిరిగేవాడి తెలిపాడు. ఇదిలా ఉండగా మరోవైపు కొత్త ఉద్యోగాల కోసం కూడా దరఖాస్తు చేసేవాడినని తెలిపారు. దీంతో పాటు తాను ఇంకా పాత కంపెనీలోనే పనిచేస్తున్నట్టు ఫేక్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పోస్ట్‌లను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేసేవాడినని తెలిపారు.

అయితే, లింక్డ్‌ఇన్‌లో తను పెట్టిన ఫేక్ పోస్టులను చూసి నిజమని నమ్మిన ఓ రిక్రూటర్ తనను సంప్రదించి “కొత్త అవకాశాల కోసం చూస్తున్నారా అని అడినట్టు తెలిపారు. తాను వెంటనే అవునని చెప్పానని..దీంతో ఆ రిక్యూటర్ తనను ఇంటర్వ్యూకి పిలిచారని తెలిపాడు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం గురించి ఇంటర్వ్యూలో పచ్చి అబద్ధాలు చెస్తూ.. అన్ని రౌండ్లు పూర్తిచేశానని తెలిపాడు. చివరికి గతంలో చేసిన ఉద్యోగం కంటే ఎక్కువ జీతం, మంచి హోదాతో కూడిన జాబ్‌ సాధించానని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..