AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: సిక్స్‌ కొట్టి అక్కడే కుప్పకూలిన ఆటగాడు.. దగ్గరకు వెళ్లి చూడగా..

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. వయస్సుతో తేడా లేకుండా ఈ మహ్మమారికి బలవుతున్నారు చాలా మంది. ఇటీవలే ముంబైలో ఓ సినీ నటీ గుండెపోటుతో మరణించిన విషమం మరవక ముందే ఆదివారం పంజాబ్‌లో ఓ యువకుడు క్రికెట్‌ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Punjab: సిక్స్‌ కొట్టి అక్కడే కుప్పకూలిన ఆటగాడు.. దగ్గరకు వెళ్లి చూడగా..
Punjab
Anand T
|

Updated on: Jun 29, 2025 | 5:51 PM

Share

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. వయస్సుతో తేడా లేకుండా ఈ మహ్మమారికి బలవుతున్నారు చాలా మంది. తాజాగా శుక్రవారం జూన్ 27న సినీ నటి షెఫాలీ జారీవాలా (42) కూడా గుండెపోటు కారణంగా మరణించారు. ఆమె మరణంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈమె మరణం నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే.. ఇలాంటి మరో ఘటన వెలుగు చూసింది. తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాళ్లోకి వెళితే.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకి చెందిన హర్‌జిత్‌ సింగ్‌ అనే యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి గురుహర్ సహాయ్ డీఏవీ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అయితే మ్యాచ్‌లో భాగంగా హర్‌జిత్‌ సింగ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో బౌలర్ వేసిన ఓ బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే సిక్స్ కొట్టిన వెంటనే అతను పిచ్‌ నుంచి కొంచెం ముందుకు వెళ్లి బ్యాట్‌ను కింద పెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. కాసేపు ఆలాగే కూర్చున్న తర్వాత అక్కడే పిచ్‌పై పడిపోయాడు. ఆది గమనించిన నాన్-స్ట్రైకర్‌గా ఉన్న మరో ఆటగాడు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చి ఎమైందని అడిగగా హర్‌జిత్‌ సింగ్‌ స్పందించలేదు.

దీంతో గ్రౌండ్‌లో ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగా బ్యాటర్ వద్ద పరిగెత్తుకుంటూ వచ్చారు. అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. కానీ హర్‌జిత్‌ స్పందించకపోవడంతో.. కొంతమంది అతని చేతులకు, మరికొందరు కాళ్లను భాగా రఫ్‌ చేశారు. అయినా హర్‌జిత్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ హర్‌జిత్‌ను పరిశీలించిన వైద్యులు అతని గుండెపోటు కారణంగా అప్పటికే మరణించినట్టు తెలిపారు. అయితే హర్‌జిత్‌ 49 పరుగులు చేసిన తర్వాత ఇలా గుండెపోటుతో పడిపోయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది